ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ జూన్ 18న గ్రాండ్ రిలీజ్‌

ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ ప్ర‌పంచ‌వ్యాప్తంగా జూన్ 18న గ్రాండ్ రిలీజ్‌

త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తోన్న ‘రొమాంటిక్’ మూవీకి డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్ క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ స‌మ‌కూరుస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఆయ‌న శిష్యుడు అనిల్ పాదూరి డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. కేతికా శ‌ర్మ హీరోయిన్. ‘ఇస్మార్ట్ శంక‌ర్’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘రొమాంటిక్’ రిలీజ్ డేట్‌ను సోమ‌వారం స్టైల్‌గా అనౌన్స్ చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జూన్ 18న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌లో టైటిల్‌కు న్యాయం చేస్తూ.. న‌డుస్తున్న బ‌స్ డోర్ ద‌గ్గ‌ర‌ హీరోయిన్ కేతికా శ‌ర్మ‌ను ఆకాష్ లిప్ లాక్ చేస్తుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఒక ముఖ్య పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తున్న ఈ చిత్రం ఇంటెన్స్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోంది. సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తుండ‌గా, న‌రేష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ఇదివ‌ర‌కు రిలీజ్ చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ సాంగ్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రాగా, పోస్ట‌ర్స్‌కు సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై సూప‌ర్బ్ బ‌జ్ వ‌చ్చింది.

తారాగ‌ణం:
ఆకాష్ పూరి, కేతికా శ‌ర్మ‌, ర‌మ్య‌కృష్ణ‌, మ‌క‌రంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్‌, సున‌య‌న‌.

సాంకేతిక బృందం:
స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌: పూరి జ‌గ‌న్నాథ్‌
డైరెక్ట‌ర్‌: అనిల్ పాదూరి
నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ కౌర్‌
స‌మ‌ర్ప‌ణ‌: లావ‌ణ్య‌
బ్యాన‌ర్స్‌: పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్‌
మ్యూజిక్‌: సునీల్ క‌శ్య‌ప్‌
సినిమాటోగ్ర‌ఫీ: న‌రేష్‌
ఎడిటింగ్‌: జునైద్ సిద్దిఖి
ఆర్ట్‌: జానీ షేక్‌
లిరిక్స్‌: భాస్క‌ర‌భ‌ట్ల‌
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

 
Akash Puri’s Romantic Grand Release Worldwide On June 18th

Dashing director Puri Jagannadh has provided story, screenplay and dialogues for his son Akash Puri’s next outing Romantic being helmed by his protégé Anil Paduri. After delivering a blockbuster with ‘iSmart Shankar’, Puri Jagannadh and Charmme Kaur are producing ‘Romantic’ under Puri Jagannadh Touring Talkies and Puri Connects banners.

The film’s release date is announced in style. The worldwide theatrical release date of ‘Romantic’ is now locked for June 18th. The release date poster shows Akash locking lips with his romantic interest in the film Ketika Sharma on a moving vehicle.

Starring Ramya Krishna in an important role, Romantic is touted to be an intense romantic entertainer. Sunil Kashyap scores music for the film, while Naresh handles the cinematography.

First song of the film got tremendous response and all the posters created lots of buzz on social media platforms.

Cast: Akash Puri, Ketika Sharma, Ramyakrishna, Makarand Deshpande, Uttej and Sunaina

Crew:
Story, screenplay and dialogues: Puri Jagannadh
Director: Anil Paduri
Producers: Puri Jagannadh, Charmme Kaur
Presented by: Lavanya
Banners: Puri Jagannadh Touring Talkies and Puri Connects
Music: Sunil Kashyap
Cinematography: Naresh
Editor: Junaid Siddiqui
Art Director: Jonny Shaik
Lyrics: Bhaskarbhatla
Fights: Real Satish
PRO: Vamsi-Shekar