“28 డిగ్రీస్ సెల్సీయస్” చిత్రం టీజర్ విడుదల

“28 డిగ్రీస్ సెల్సీయస్” చిత్రం టీజర్ విడుదల

"28 డిగ్రీస్ సెల్సీయస్" చిత్రం టీజర్ విడుదల

“28 డిగ్రీస్ సెల్సీయస్” చిత్రం టీజర్ విడుదల

నవీన్ చంద్ర హీరోగా షాలిని వడ్నికట్టి హీరోయిన్ గా డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్ సైడ్ సినిమాస్  పతాకాలపై సాయి అభిషేక్ నిర్మిస్తోన్న చిత్రం “28 డిగ్రీస్ సెల్సీయస్”. ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం ఏప్రిల్ 27న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో సుమంత్, అడవి శేష్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సుమంత్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగా, అడవి శేష్ చిత్ర టీజర్ ని లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నవీన్ చంద్ర, హీరోయిన్ షాలిని వడ్నికట్టి, దర్శకుడు అనిల్ విశ్వనాథ్, నిర్మాత సాయి అభిషేక్, ఎడిటర్ గారి బిహెచ్, కెమెరామెన్ వంశీ పచ్చిపులుసు,   సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, నటులు రాజా రవీంద్ర, వివ హర్ష, నటీమణులు దేవియాని శర్మ, సంతోషి శర్మ తదితరులు పాల్గొన్నారు..
సుమంత్ మాట్లాడుతూ.. అనిల్ నాకు ఐదేళ్లుగా తెల్సు. బేసిగ్గా అతను డెంటిస్ట్. నా సినిమాకు కో ప్రొడ్యూసర్ గా కూడా చేసాడు. అప్పటినుండి అతనికి డైరెక్షన్ చెయ్యాలని ఫ్యాషన్. సినిమాపై పూర్తి  అవగాహన ఉంది. ఒకసారి ఈ సినిమా లైన్ చెప్పాడు. అంతగా ఎక్కలేదు..కానీ టీజర్ చూసాక బాగా నచ్చింది.. కొత్తగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడియెన్స్ కి రీచ్ అవుతుంది అనిపించింది. సినిమా బాగా తీసాడు. టీమ్ అందరికి ఆల్ ఠె బెస్ట్ అన్నారు.
అడవి శేష్ మాట్లాడుతూ… ఈ టీమ్ అంతా నాకు బాగా కావాల్సిన వాళ్ళు. క్షణం, గూఢచారి సినిమాలకు వర్క్ చేశారు. అనిల్ నాకు కర్మ సినిమా నుండి తెల్సు. మంచి టాలెంటెడ్. ఈ సినిమా తర్వాత నేను అనిల్ తో సినిమా చెయ్యలనుకుంటున్నాను. 28 డిగ్రీస్ సెలసియస్ టీజర్ జెన్యున్ గా నచ్చింది. సినిమా సక్సెస్ అయి టీమ్ అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ… అరవింద సమేత లో బాల్ రెడ్డి క్యారెక్టర్ నాకు మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వస్తున్నాయి. అనిల్, అభిషేక్ వచ్చి నాకు కథ చెప్పారు. చాలా బాగుంది. టీమ్ అంతా మనసు పెట్టి వర్క్ చేశారు. వెరీ ఇంటెన్సివ్ లవ్ స్టోరీ. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది… అన్నారు.
దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ… ఇది నా కల. ఈ టైం కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. నన్ను, నా కథని నమ్మి అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్ అభిషేక్ కి, మా హీరో నవీన్ చంద్ర కి నా థాంక్స్. నవీన్ తన యాక్టింగ్ తో ఇన్స్పైర్ చేసి బెటర్ సీన్స్ తీయడానికి హెల్ప్ చేసాడు. టైటిల్ ఎంత కొత్తగా ఉందో సినిమా కూడా అంతేలా ఉంటుంది. 60 శాతం జార్జియలో షూట్ చేసాం. అక్కడ ఒక తెలుగు వాడి కథ ఇది. శివ ఎక్సలెంటు విజువల్స్ ఇచ్చాడు. ఇదొక ప్రేమ కథ. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందుతారు. టీమ్ అంతా బాగా సపోర్ట్ చేసి ఎనకరేజ్ చేశారు. వారందరికీ నా థాంక్స్.. అన్నారు..
నిర్మాత సాయి అభిషేక్ మాట్లాడుతూ… ఇదొక సస్పెన్స్, లవ్ థ్రిల్లర్, ఇంటెన్స్ స్టోరీ. నవీన్, షాలిని అందరూ సూపర్బ్ గా యాక్ట్ చేశారు. 28 డిగ్రీన్ సెల్సీయస్ టైటిల్. దానికి తగ్గట్లుగానే మా డైరెక్టర్ అనిల్ సినిమాని తెరకెక్కించాడు. టెక్నికల్ టీమ్ అంతా నాకు బాగా సపోర్ట్ చేశారు. వారికి నా థాంక్స్. సినిమాని మే లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.
నవీన్ చంద్ర, షాలిని వడ్నికట్టి, రాజా రవీంద్ర, ప్రియదర్శి, వివ హర్ష, జయ ప్రకాష్, అభయ్ బెతిగంటి, దేవియాని శర్మ, సంతోషి శర్మ, నితీష్ పాండే, అజయ్, చలపతి రాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లై-దర్శకత్వం: డా.అనిల్ విశ్వనాథ్, నిర్మాత: సాయి అభిషేక్, కో- ప్రొడ్యూసర్స్; విక్రమ్ జూపూడి, సంజయ్ జూపూడి, అసోసియేట్ ప్రొడ్యూసర్స్; జుంగా పృద్వి, తేజ వర్మ, ఎడిటర్; గారి బిహెచ్, డిఓపి; వంశీ పచ్చిపులుసు, సంగీతం; శ్రావణ్ భరద్వాజ్, రే రికార్డింగ్; సాయి చరణ్ పాకాల, మాటలు- పాటలు; కిట్టు విస్సా ప్రగడ, కాస్ట్యూమ్ డిజైనర్స్; అనుష, అభినయ, రేకా బొగ్గారపు, వెంకీ, లైన్ ప్రొడ్యూసర్: రాజు కొత్తపెల్లి, వినయ్ ముమ్మిడి