సి సి సి కి రామోజీరావు గారు 10 లక్షలు విరాళం

సి సి సి కి రామోజీరావు గారు 10 లక్షలు విరాళం

సి సి సి కి రామోజీరావు గారు 10 లక్షలు విరాళం

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కరోనా క్రైసెస్ చారిటీ మనకోసంకు తనవంతు సాయంగా రామోజీరావు గారు 10 లక్షలు విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సీసీసీకి రామోజీ రావు గారి ద‌గ్గ‌ర నుండి ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్టీజీఎస్ ద్వారా వ‌చ్చింద‌ని తెలిసిన త‌ర్వాత నేను ప్ర‌త్యక్షంగా ఆయ‌న‌కు ఫోన్ చేసి ధ‌న్య‌వాదాలు తెల‌ప‌డం జ‌రిగింది. మీలాంటి వాళ్ళు మేము చేస్తున్న కార్య‌క్ర‌మాన్ని గుర్తించ‌డ‌మే కాకుండా దాన్ని ప్రోత్స‌హిస్తూ ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు ఇవ్వ‌డం చాలా ఆనందంగా ఉంది అన్నాను. దీనికి ఆయ‌న చిరంజీవి గారు , నేను మీరు చేసే కార్యకమాలను , ఇంటింటికి సరఫరా చేసే విధానము గమనిస్తున్నాను. బాగాచేస్తున్నారు , అయినా నేను ఇచ్చింది చాలా చిన్న అమౌంట్ అన్నారు.. అమౌంట్ గురించి కాదండి.. మీలాంటి వాళ్ళు మేము చేస్తున్న సేవ‌ల్ని గుర్తించి వెన్ను తట్టటమే కోట్ల విలువ , మాకందే ప్ర‌తి పైసా క‌ష్టాల్లో ఉన్న‌వారికి నేరుగా అందాలని చేస్తున్న ప్రయత్నం చాల సంతృప్తినిస్తుంది అన‌గానే.. మీరు నిజాయితీగా చేస్తారు చిరంజీవి గారు… మీరు అందించే ప్ర‌తి పైసా వారి చేతికి, నోటికి అందుతుంద‌నే న‌మ్మ‌కం నాకుంది… అంటూ రామోజీరావు గారు ఎంత‌గానో ప్రోత్స‌హిస్తూ, ఉత్సాహ‌ప‌రిచారు. వారికి ప్ర‌త్యేకించి నా ట్విట్ట‌ర్ ద్వారా ధ‌న్య‌వాదాలు తెలుపుకోవ‌డం కూడా జ‌రిగింది. మా సీసీసీ సభ్యులందరి త‌ర‌ఫున మ‌రొక్క‌సారి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు మెగాస్టార్ చిరంజీవి.