షూటింగ్ లో గాయ‌ప‌డ్డ ఎన్టీఆర్!!

షూటింగ్ లో గాయ‌ప‌డ్డ ఎన్టీఆర్!!
షూటింగ్ లో గాయ‌ప‌డ్డ ఎన్టీఆర్!!
షూటింగ్ లో గాయ‌ప‌డ్డ ఎన్టీఆర్!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్  చేతికి గాయమైంద‌ని ఫిలింన‌గ‌ర్ వార్త‌లు.  ఇటీవల కుడిచేతి మణికట్టుకు కట్టుతో ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్‌’ లొకేషన్ లో, షూటింగులో గాయమైందో? జిమ్ లో వర్కవుట్స్ గట్రా చేస్తున్నప్పుడు గాయమైందో? ఆ గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్టీఆర్ షూటింగ్ చేస్తున్నారు. ప్రతిరోజు ‘ఆర్ఆర్ఆర్‌’ లొకేషన్ కి వెళ్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇంతకు ముందు వడోదరాలో షెడ్యూల్ లో జిమ్ వర్కవుట్స్ చేస్తున్న సమయంలో రామ్ చరణ్ కు గాయమైన సంగతి తెలిసిందే. దాంతో పుణె షెడ్యూల్ వాయిదా వేశారు. రామ్ చరణ్ గాయం నయం కావడంతో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఓ పక్క షూటింగ్ చేస్తూ మరోపక్క ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ అన్వేషణలో పడింది చిత్రబృందం. శ్రద్ధా కపూర్, కృతి సనన్, నివేదా థామస్ పేర్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి ఎవరిని ఎంపిక చేస్తారో! లేదా మరో విదేశీ భామ కోసం చేస్తున్నారో??