విజయ్ దేవరకొండ – సుకుమార్ ప్రాజెక్ట్ లో ఎలాంటి మార్పు లేదు

విజయ్ దేవరకొండ – సుకుమార్ ప్రాజెక్ట్ లో ఎలాంటి మార్పు లేదు

విజయ్ దేవరకొండ – సుకుమార్ ప్రాజెక్ట్ లో ఎలాంటి మార్పు లేదు – స్పష్టం
చేసిన నిర్మాణ సంస్థ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్
లో ఓ క్రేజీ ఫిల్మ్ రాబోతోంది. ఈ సినిమాను ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ
సంస్థ తన డెబ్యూ ప్రాజెక్ట్ గా నిర్మిస్తోంది. టాలీవుడ్ లో ఆసక్తి రేపిన
ఈ ప్రెస్టీజియస్ సినిమాపై ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చాయి. ఈ పుకార్లను
చిత్ర నిర్మాణ సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ ఖండించింది. ఇవన్నీ
అవాస్తవాలని, విజయ్ దేవరకొండ – సుకుమార్ కాంబో సినిమా ముందుగా అనుకున్న
ప్రకారమే సెట్స్ మీదకు వెళ్తుందని ప్రకటించింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ “లైగర్” సినిమా చేస్తున్నారు, దర్శకుడు
సుకుమార్ “పుష్ప” సినిమాను తెరకెక్కిస్తున్నారు.  వీళ్లిద్దరి
కమిట్మెంట్స్ అయిన వెంటనే విజయ్ – సుకుమార్ చిత్రం ప్రారంభం కానున్నట్లు
నిర్మాణ సంస్థ తాజా ప్రెస్ నోట్ లో వెల్లడించింది. ఈ క్రేజీ సినిమా మరింత
ప్రతిష్టాత్మకంగా,భారీ స్థాయిలో తెరకెక్కిస్తామని ఫాల్కన్ క్రియేషన్స్
సంస్థ తెలిపింది.


Director Sukumar and hero Vijay Deverakonda film As Per Schedule

Rowdy Star Vijay Deverakonda is going to team up with director Sukumar
B. This film was announced way back in September 2020 by Falcon
Creations LLP as its debut production. This crazy combination invited
a few unwanted reports within the media that this film got shelved.

Reacting on these media reports team Falcon has condemned them and
urged everyone not to believe in rumours. “As per the schedule,
Sukumar and Vijay film hit the sets,” said Falcon and they added that
this film will only get bigger.

Currently Vijay Deverakonda is doing pan-India film ‘Liger’ while
Sukumar is doing ‘Pushpa’ will Stylish Star Allu Arjun. Once both
Vijay and Sukumar wrap up their commitments, this combination will go
floors.