కూతురు డాన్స్ కు ఫిదా అయిన మ‌హేష్‌!!

కూతురు డాన్స్ కు ఫిదా అయిన మ‌హేష్‌!!
కూతురు డాన్స్ కు ఫిదా అయిన మ‌హేష్‌!!
            మ‌హేష్ బాబు కూతురు సితార మ‌రోసారి త‌న టాలెంట్ తో ఆక‌ట్టుకుంది. అయితే సితార త‌న డ్యాన్స్ తో తండ్రి మ‌హేష్ ని మురిపించేసింది. దీంతో సితార డ్యాన్స్ కు ఫిదా అయిన సూప‌ర్ స్టార్. త‌న కూతురు టాలెంట్ అంద‌రికీ తెలియాల‌ని స్వ‌యంగా ఆయ‌నే  `నా సీతా పాప‌`  అంటూ త‌న సోష‌ల్ మీడియాలో ఆ వీడియోను షేర్ చేశారు. అయితే ఇక్క‌డ విశేష‌మేమిటంటే సితార డ్యాన్స్ చేసిన సాంగ్ . `బాహుబ‌లి-2` చిత్రంలోని అనుష్క ఆడిపాడిన `మురిపాలా ముకుందా` అనే పాట‌కు చ‌క్క‌ని అభిన‌యంతో పాటు , పాట‌ను హమ్మింగ్ చేస్తూ వేసిన స్టెప్స్ చాలా బాగున్నాయి. మ‌హేష్ కాదు ఆ వీడియోను చూసిన ఏవ‌రైనా  వావ్  సితార `వాట్  ఏ టాలెంట్` అంటూ మెచ్చుకోవాల్సిందే. అంత అద్భుతంగా చేసింది డ్యాన్స్.
అప్పుడప్పుడు మ‌హేష్ ఇలా త‌న పిల్ల‌ల గురించి వారి వీడియోల‌ను త‌న అభిమానుల‌తో పంచుకుంటారు. అయితే తాజాగా పెట్టిన ఈ వీడియోను అభిమానులు చూస్తూ త‌మ సంతోషాన్ని కామెంట్స్ రూపంలో రిప్లై ఇస్తూ సంతోష ప‌డుతున్నారు.