`వై` మూవీ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఏప్రిల్‌ 2న విడుదల !!

`వై` మూవీ  తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఏప్రిల్‌ 2న విడుదల !!

శ్రీరామ్‌, రాహుల్‌ రామకృష్ణ  థ్రిల్లర్‌ మూవీ ‘వై’… తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఏప్రిల్‌ 2న విడుదల !!
 
స‌మంత‌తో సామ్‌జామ్‌, రానా ద‌గ్గుబాటితో నెం.1 యారి వంటి టాక్ షోస్‌తో, ర‌వితేజ బ్లాక్‌బ‌స్ట‌ర్ క్రాక్‌, అల్ల‌రి నరేష్ నాంది వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న ‘ఆహా’ ఇప్పుడు థ్రిల్లర్‌ మూవీ ‘వై’తో ప్రేక్షకులను అలకరించడానికి సిద్ధమైంది. శ్రీరామ్‌‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన థ్రిల్లర్‌ ‘వై’ మూవీ ‘ఆహా’లో ఏప్రిల్‌ 2న విడుదలవుతుంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సినిమా ట్రైలర్‌ను సీనియర్‌ జర్నలిస్ట్‌ రవిచంద్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా…
 
నిర్మాత ఏరు కొండ రఘురామ్ మాట్లాడుతూ “మా ‘వై’ సినిమా థియేటర్‌లో విడుదలైతే ఏ రేంజ్‌ రెస్పాన్స్‌ వస్తుందో.. ఈరోజు అలాంటి రెస్పాన్స్‌ రావడానికి కారణం ఆహా అండ్‌ టీమ్‌. మా డైరెక్టర్‌తో బాలుగారితో జర్నీ చాలా గొప్పగా ఉంటుంది. ఆయనతోనే కంటిన్యూగా సినిమాలు చేయాలనే ఆలోచన ఉంటుంది. వికాస్‌ అల్టిమేట్‌ మ్యూజిక్‌ అందించారు. మంచి టీమ్‌ కుదిరింది. అందరికీ థాంక్స్‌” అన్నారు. 
 
డైరెక్టర్‌ బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ “‘ఆహా’ టీమ్‌కు ధన్యవాదాలు. చిన్న సినిమాలకు ఆహా గొప్ప వేదికగా మారుతుంది. వారితో నెక్ట్స్‌ సినిమా కమిట్‌మెంట్‌ కూడా ఉంది. రాహుల్‌, శ్రీరామ్‌గారు లేకపోతే నా సినిమా లేదు. నాకంటే ఈ సినిమా కోసం వాళ్లే ఎక్కువగా కష్టపడ్డారు. నిర్మాత రఘురామ్‌గారు ఏదడిగినా కాదనకుండా సపోర్ట్‌ చేస్తూ వచ్చారు.ఏప్రిల్‌ 2న విడుదలవుతున్న మా ‘వై’ సినిమాకు అందరూ సపోర్ట్‌ అందించాలని కోరుతున్నాం” అన్నారు. 
 
రాహుల్‌ రామకృష్ణ మాట్లాడుతూ – “బాలుగారు నాకు ఈ కథను వాట్సాప్‌లో చెప్పారు. నేను ఫుల్‌ ఫ్లెజ్డ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉన్న సినిమాలో నటించడం ఇదే తొలిసారి. శ్రీరామ్‌గారితో పోటీ పడి నటించాను. హీరోయిన్‌గా దేవయానిగారు మంచి కోస్టార్‌. డైరెక్టర్‌ బాలు కథను తెరకెక్కించిన విధానం బావుంటుంది. ఎంటైర్‌ టీమ్‌ అందరం ఎంజాయ్‌ చేస్తూ చేశాం. వండర్‌ఫుల్‌ ఎక్స్‌పీరియెన్స్‌. ఆహా టీమ్‌కు ధన్యవాదాలు” అన్నారు. 
 
హీరో శ్రీరామ్‌ మాట్లాడుతూ “నా తొలి చిత్రం విడుదలై 20 ఏళ్లు అవుతుంది. మా ‘వై’ సినిమాను విడుదల చేస్తున్న ఆహా టీమ్‌కు ధన్యవాదాలు. వికాస్‌గారి మ్యూజిక్‌, ఛోటాగారి ఎడిటింగ్‌ ఇలా మంచి టీమ్‌ కుదిరింది. రాహుల్‌ రామకృష్ణ మంచి కోస్టార్‌.బాలుగారి దర్శకత్వంలో చాలా తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేశాం. నిర్మాత రఘురామ్‌గారి సపోర్ట్‌తోనే సినిమాను పక్కా ప్లానింగ్‌తోనే పూర్తి చేశాం. రాహుల్‌ వండర్‌ఫుల్‌ యాక్టర్‌. ‘వై’ మంచి థ్రిల్లర్‌. సీట్‌ ఎడ్జ్‌ మూవీ. ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. వారికి మరోసారి కృతజ్ఞతలు  తెలియజేస్తున్నాం” అన్నారు. 
 
ఈ కార్యక్రమంలో జెమినీ సురేష్‌, దేవయాని తదితరులు పాల్గొన్నారు. 
 
నటీనటులు: శ్రీరామ్‌, రాహుల్‌ రామకృష్ణ, అక్షయ చందర్‌, జెమినీ సురేష్‌, టీఎన్‌ఆర్‌, రఘుబాబు, కత్తి మహేశ్‌ తదితరులు
 
సాంకేతిక వర్గం:
 
దర్శకత్వం: బాలు అడుసుమిల్లి
నిర్మాతలు: ఏరు కొండ రఘురామ్‌, శ్రీనివాస్‌ వేగి, మురళి మాటూరు
సినిమాటోగ్రఫీ: దర్శన్‌
ఎడిటర్‌: ఛోటా కె.ప్రసాద్‌
మ్యూజిక్‌:  వికాస్‌ బడిస