ఘనంగా ముగిసిన కళాకారుల క్రికెట్ సంబరాలు

ఘనంగా ముగిసిన కళాకారుల క్రికెట్ సంబరాలు

ఘనంగా ముగిసిన కళాకారుల క్రికెట్ సంబరాలు

 

వైజాగ్ ఆర్టిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ వి యాక్ట్ ధి ఫ్రెండ్ షిప్ కప్ 2020 పోటీలు ఉత్సాహంగా ముగిసాయి. సత్ గీత్ క్రియేషన్స్ క్రికెట్ అకాడెమీ రాథో గణేష్,,యాక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మరియు విష్ణు స్కూల్స్ అధినేత యాద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 22,23 రెండు రోజుల పాటు జ్ఞానపురం లోని జూబ్లీ స్కూల్ గ్రౌండ్స్ లో జరిగిన వైజాగ్ ఆర్టిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ లో మేకప్ ఆర్టిస్టులు, సింగర్స్, డాన్సర్స్, రంగస్థల, సినీ, టీవీ ఆర్టిస్టులు, యాంకర్స్, ఇలా 24 క్రాఫ్ట్స్ కళాకారులు అందరూ ఉత్సహంగా పాల్గొని సందడి చేశారు. అలాగే ఈ క్రికెట్ టోర్నమెంట్ లో సత్ గీత్ క్రికెట్ అకాడమీ స్టూడెంట్స్ మూడో వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క టీం లోని పాల్గొని వారి నైపుణ్యం చూపించారు. హోరా హోరీగా జరిగిన ఈ టోర్నమెంట్ లో 8 టీం లు తలపడగా, మేకప్ ఆర్టిస్ట్ భరణి కెప్టెన్సీ లో ‘కైలాష్ నైట్స్ జట్టు విజేత గా నిలిచి కప్ సొంతం చేసుకోగా, ప్రముఖ రంగస్థల నటులు బాదంగీర్ సాయి కెప్టెన్సీ లో స్టీల్ సిటీ రాక్స్ జట్టు రన్నర్ గా నిలిచింది. ముగింపు కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గం ఎం.ఎల్.ఎ గణబాబు ముఖ్య అతిగా విచ్చేసారు. ఎక్స్ ఏ డి సి పి ఖాన్, డి.ఎస్.పి శ్రీ నగేష్, హెచ్.పి సి.ఎల్ డిజిఎమ్ (స్కిల్ డెవలప్మెంట్) దాస్, జబర్దస్త్ అప్పారావు, వానపల్లి రవికుమార్, కొణతాల రాజు, ప్రొడ్యూసర్ సాంబ, అల్లు రమేష్, బుగత సత్యన్నారాయణ ,ఎఫ్.ఎం బాబాయ్, ఏ ఎం ప్రసాద్ ఆర్టిస్ట్ సంధ్య, ఎం ఎస్ మాధవ్, సింగర్ రా జు , నటరాజ్ ఆల్బమ్స్ కిషోర్, వరప్రసాద్, లతీష్, ప్రతాప్ పాల్గొని విన్నర్, రన్నర్ టీం లకు ట్రోఫీ అందజేశారు. ఇదే ఉత్సాహంతో ప్రతీ ఏటా కళాకారుల క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని, త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల కళాకారులందరిని ఐక్యం చేసి ఫ్రెండ్లీ క్రికెట్ కప్ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని నిర్వాహకులు గణేష్ తెలిపారు.