Amazon, MX player‌లో విడుదలవుతున్న ‘పేపర్ బాయ్’ డైరెక్టర్ జయశంకర్ రూపొందించిన Vitamin She చిత్రం

Amazon, MX player‌లో విడుదలవుతున్న ‘పేపర్ బాయ్’ డైరెక్టర్ జయశంకర్ రూపొందించిన Vitamin She చిత్రం

 

Amazon, MX player‌లో విడుదలవుతున్న ‘పేపర్ బాయ్’ డైరెక్టర్ జయశంకర్ రూపొందించిన Vitamin She చిత్రం 
 
‘పేపర్ బాయ్’ చిత్రంతో దర్శకునిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్న జయశంకర్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ నేపథ్యంతో తాజాగా రూపొందించిన చిత్రం ‘Vitamin She’.  షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్‌తో యూట్యూబ్ లో ప్రాచుర్యం పొందిన శ్రీకాంత్ గుఱ్ఱం ఇందులో హీరోగా నటించారు. గుజరాతీ భాషలో రెండు సినిమాల్లో కథానాయికగా నటించిన ప్రాచి ఇందులో హీరోయిన్‌గా చేశారు. రంజిత్ రెడ్డి, వికాస్, మొయిన్, సంజీవ్ జోషి, అశోక్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పోలిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. Vitamin She చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థలు, Amazon, MX player ద్వారా డిసెంబర్ 30వ తేదీన రిలీజ్ అవుతున్నది.
 
 
Vitamin She చిత్రం రిలీజ్ సందర్భాన్ని పురస్కరించుకొని దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ- ”ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అనేది మనుషుల జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఈ సినిమా మూల కథాంశం. మనకు సహాయకారిగా ఉంటుందనుకున్న ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ చివరకు మనల్నే డామినేట్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనేది సెటైరికల్‌గా ఈ సినిమాలో చూపించాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఎంత టాప్ లెవెల్‌కి వెళ్లినా… చివరకు మనుషుల్నే రీప్లేస్ చేసే స్థాయికి వచ్చినా కూడా, మనుషుల ఎమోషన్స్ ని రీప్లేస్ చేయడం మాత్రం వాటికి అసంభవం. ఇలాంటి అంశాలను వినోదాత్మకంగా చూపించాం. ఈ సినిమాలో మొత్తం పన్నెడు పాత్రలు ఉంటాయి కానీ, ప్రధానంగా 4 పాత్రల చుట్టే సినిమా తిరుగుతుంది. లాక్‌డౌన్ టైమ్‌లో ఈ చిత్రం షూటింగ్ చేశాం. స్టోరీ పరంగానే కాకుండా, టెక్నీకల్ గా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉంటుందీ సినిమా.   విదేశీ, స్వదేశీ ప్రేక్షకులు ఈ సినిమా‌ను Amazon prime Video తోపాటు  MX Player (https://www.mxplayer.in/movie/watch-vitamin-she-telugu-movie-online-0f283772ccedbbfb17412ac0745f8bf4?utm_source=mx_android_share),  వీక్షించవచ్చు అని తెలిపారు. 
 
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శివప్రసాద్, సంగీతం: PVR రాజు, ఎడిటింగ్ : LN స్టూడియోస్ , నిర్మాత: రవి పోలిశెట్టి, రచన-దర్శకత్వం : జయశంకర్.