Vijay deverakonda amazed by a disable girl’s gratitude
దివ్యాంగురాలు స్వప్నిక పెన్సిల్ ఆర్ట్ కు ఫిదా అయిన విజయ్ దేవరకొండ
సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి
ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా
హీరో అనిపించుకుంటున్నాడు విజయ్.దానికి ఉదాహరణ లాక్ డౌన్ సమయంలో అతను
చేసిన మిడిల్ క్లాస్ ఫండ్ అనే సహాయం.నిత్యావసర సరుకులు కొనడానికి
ఇబ్బందులు పడిన కొన్ని కుటుంబాలకు విజయ్ సరుకులు ఇప్పించి ఆదుకున్నాడు.
ఆ సాయం పొందిన స్వప్నిక అనే ఓ దివ్యాంగురాలు కృతజ్ణతా భావంగా నోటితో
పెన్సిల్ పట్టి విజయ్ బొమ్మ గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ
వీడియా చూసి ఫిదా అయిన విజయ్ రిప్లై ఇస్తూ ‘‘లాట్స్ ఆఫ్ లవ్
స్వప్నికా.. నువ్వు మాకు స్ఫూర్తిదాయకం’’ అని ఆమెకు ధన్యవాదాలు
తెలిపాడు.స్వప్నిక పోస్ట్ చేసిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్
అయింది.అందరూ ఆమెకు హాట్సాఫ్ చెబుతున్నారు.
Vijay Deverakonda amazed by a disable girl’s gratitude!
During the lockdown, hero Vijay Deverakonda came up with this
initiative called Middle Class Fund to help the needy. He along with
his team provided ration to people who could not afford and it was
done with utmost transparency.
One of the many who received help is a disable girl from Srikakulam
district of AP. Identified as Swapnika Kovvada, this girl is limbless.
Yet that did not deter her spirit and using her mouth, she drew a
beautiful art of Vijay Deverakonda. She shared the same on Twitter and
posted it to Vijay.
Blown away by this, Vijay tweeted, “Sending you lots of love Swapnika.
And taking strength and inspiration from you. Thank you” with a
red-heart symbol.
That’s indeed a true gratitude from the girl and Vijay is known to
recognise such love and affection.