సమంతతో తెలుగు , తమిళ భాషల్లో ‘శ్రీదేవి మూవీస్‌’ శివలెంక కృష్ణప్రసాద్‌ చిత్రం !!

సమంతతో తెలుగు , తమిళ భాషల్లో ‘శ్రీదేవి మూవీస్‌’ శివలెంక కృష్ణప్రసాద్‌ చిత్రం సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌  తెలుగు, తమిళ  భాషల్లో ఓ సినిమా నిర్మించనున్నారు. దీనికి ఇద్దరు యువకులు హరి–హరీష్‌దర్శకత్వం వహించనున్నారు. శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్ నెం 14గా తెరకెక్కనున్నఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. విజయదశమిసందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘విభిన్న కథాంశంతో ఈ సినిమా తీస్తున్నాం. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిది. బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’ తీశాను. ఆయనతో మరోమూడు చిత్రాలు చేశాను . నానితో ‘జెంటిల్‌మన్‌’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ నిర్మించాను . ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. చాలాకొత్తగా ఉంటుందీ సినిమా. సమంతగారు కథ వినగానే ఎగ్జైట్‌ అయ్యారు. వెంటనే ఓకేచెప్పారు. హరి, హరీష్‌ దర్శక ద్వయాన్ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాం. నవంబర్‌లోతెలుగు, తమిళ  భాషల్లో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.   Samantha’s next confirmed in Sivalenka Krishna Prasad’s Sridevi Movies Banner.   Lady Superstar Samantha’s

Read more