టాలీవుడ్ హీరోలు రిస్క్ చేస్తున్నారా??

టాలీవుడ్ హీరోలు రిస్క్ చేస్తున్నారా??
టాలీవుడ్ హీరోలు రిస్క్ చేస్తున్నారా??
 
‘తెనాలి రామకృష్ణ’ షూటింగులో సందీప్ కిషన్‌కి గాయమైంది. బాంబ్ బ్లాస్ట్ సీన్ చేస్తుండగా గాజు ముక్కలు కంటికింద గట్టిగా గుచ్చుకున్నాయి. వెంటనే షూటింగుకు ప్యాకప్ చెప్పి హైదరాబాద్ వచ్చారు. మళ్ళీ ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేస్తారో తెలియదు. సందీప్ మాత్రం త్వరగా కోలుకుని ‘నిను వీడని నీడను నేనే’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని ట్వీట్ చేశాడు.  ’96’ రీమేక్ కోసం స్కై డైవింగ్ ప్రాక్టీస్‌ చేస్తుండగా శర్వానంద్ భుజాలకు తీవ్ర గాయమైంది. కాలికి చిన్న ప్రాక్చర్ అయింది. సోమవారం శర్వాకు సర్జరీ జరుగుతుంది. మళ్ళీ ఆయన కోలుకోవడానికి మూడు నెలలు పడుతుందని టాక్. అప్పటివరకూ శర్వానంద్ చేస్తున్న సినిమాల షూటింగులు వాయిదా వేయక తప్పదు. వీళ్లిద్దరి కంటే ముందు విశాఖలో నాగశౌర్య గాయపడ్డాడు. ఒక నెల విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో షూటింగుకు బ్రేక్ పడింది. 
 
యువ హీరోలు గాయాల పాలుకావడం తెలుగు చిత్ర పరిశ్రమను కలవరపెట్టే అంశమే. షూటింగుల్లో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాంతక ఘటనలు జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ప్రమాదాలకు కారణాలు విశ్లేషిస్తే తప్పంతా హీరోలదే అనిపిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. రిస్కులు తీసుకుని షూటింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ, యువ హీరోలు రిస్కులు తీసుకుని ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 
 
ఫైట్‌లో పదిహేను అడుగులు ఎత్తున్న బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకే సీన్‌ని డూప్ లేకుండా స్వయంగా ఫైట్ చేయాలనుకున్నాడు నాగశౌర్య. అంతవరకూ ఓకే. కనీసం రోప్ అయినా కట్టుకోవాలి కదా. అదీ చేయలేదు. అందువల్ల, బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకగానే అదుపుతప్పి కాలికి ప్రాక్చర్ అయింది. సందీప్ కిషన్ కూడా రిస్క్ షాట్ అని తెలిసీ చేయడానికి ముందడుగు వేశాడు. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. స్వయంగా సందీప్ కిషనే యాక్షన్ కొరియోగ్రాఫర్ తప్పు లేదని ట్వీట్ చేశాడు. శర్వానంద్ స్కై డైవింగ్ ప్రాక్టీస్‌లో