`సీతారామ‌రాజు` షూటింగ్ ప్రారంభం!!!   

`సీతారామ‌రాజు` షూటింగ్ ప్రారంభం!!!   
`సీతారామ‌రాజు` షూటింగ్ ప్రారంభం!!!   
  
`సీతారామ‌రాజు` షూటింగ్ ప్రారంభం!!!
  రిసాలి ఫిల్మ్ అకాడ‌మీ అండ్ స్టూడియో నిర్మాణంలో సునీల్ కుమార్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్న చిత్రం `సీతారామ‌రాజు“ ఏ ట్రూ వారియ‌ర్. మ‌న్యంలో జ‌ర‌గుతున్న తెల్ల‌దొర‌ల అకృత్యాల‌కు నిర‌స‌న‌గా విప్ల‌వ బావుటా ఎగ‌ర‌వేసిన పాతికేళ్ల కుర్రాడి పోరాట గాథ‌ను ఉత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో తెర‌కెక్కించ‌నున్నారు. ఈ చిత్రం ప్రెస్ మీట్ ఫిలించాంబ‌ర్ లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా డా.శ్రీనివాస్ మాట్లాడుతూ…“సొంతూరు , గంగ‌పుత్రులు , గ‌ల్ఫ్ వంటి సామాజిక చిత్రాల‌ను రొమాంటిక్ క్రైమ్ క‌థ , క్రిమిన‌ల్ ప్రేమ‌క‌థ వంటి యూత్ ఫుల్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన పి.సునీల్ కుమార్ రెడ్డి లాంటి స‌క్స‌స్ ఫుల్ ద‌ర్శ‌కుడితో `సీతారామ‌రాజు` చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది.  అల్లూ రి సీతారామ‌రాజు బ‌యోపిక్ తీయడం చిన్న విష‌యం కాదు. దానికి కావాల్సిన సీజీ వ‌ర్క్ ఆల్రెడీ స్టార్డ్ చేసాం“ అన్నారు.
ద‌ర్శ‌కుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…“ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే తొలిసారిగా పూర్తి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌స‌తుల‌తో స్టూడియో ఏర్పాటు చేసిన రిసాలి ఫిల్మ్ అకాడ‌మీ అండ్ స్టూడియో అధినేత శ్రీనివాస్ గారితో క‌లిసి శ్రావ్య ఫిలింస్ బేన‌ర్ లో సీతారామ‌రాజు తీయం చాలా సంతోషం.  నా కెరీర్ లో మేకింగ్ ప‌రంగా, కంటెంట్ ప‌రంగా, బ‌డ్జెట్ ప‌రంగా చాల పెద్ద సినిమా ఇది.  అల్లూరి సీతారామ‌రాజు చేసిన సాయుధ పోరాట నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో ఉన్న గ్రాఫిక్స్ వ‌ర్క్ కు సంబంధించిన సీజీ వ‌ర్క్ ఇప్ప‌టికే జ‌రుగుతోంది“ అన్నారు.
నిర్మాత యెక్క‌లి ర‌వీంద్ర‌బాబు మాట్లాడుతూ…“ మా బేన‌ర్ లో ఇది పెద్ద సినిమా. సునీల్ కుమార్ గారు ఏ సినిమా చేసినా చాలా గ్రౌండ్ వ‌ర్క్ చేసి సినిమా తీస్తారు. ఈ సినిమా అంద‌రికీ మంచి పేరు తెస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.