Sanju Bhai in Crazy Project !!

Sanju Bhai in Crazy Project !!
Sanju Bhai in Crazy Project !!

 క్రేజీ ప్రాజెక్ట్ లో సంజు భాయ్‌!!

 
  య‌ష్ హీరోగా క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లోనే ప్రెస్టేజియ‌స్ ప్రాజెక్ట్ గా రూపొందిన `కెజియ‌ఫ్‌` చిత్రం తెలుగులోనూ విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించింది. ఇక ఆ చిత్రానికి సీక్వెల్ గా `కేజియ‌ఫ్ 2` చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ అధీర అనే ఓ విభిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ రోజు సంజయ్ ద‌త్ కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ఈ రోజు చిత్ర యూనిట్ అధికారికంగా లాంచ్ చేసింది. త‌ల‌పాగా చుట్టుకుని సూటిగా చూసే క‌ళ్లు మాత్ర‌మే కనిపించేలా లుక్ ని విడుద‌ల చేశారు. దీంతో ఇన్ని రో్జులు సోష‌ల్ మీడియాలో సంజు న‌టిస్తున్నాడా?  లేదా? అంటూ జ‌రిగిన చ‌ర్చ‌ల‌కు ముగింపు ప‌డిన‌ట్లైంది. క్రేజీ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్  కి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా శ్రీనిధి హీరోయిన్ గా నటిస్తోంది.