‘రౌడీ బాయ్స్’ నుంచి ‘బృందావ‌నం నుంచి.. ’ సాంగ రిలీజ్‌ !!

‘రౌడీ బాయ్స్’ నుంచి ‘బృందావ‌నం నుంచి.. ’ సాంగ రిలీజ్‌ !!

సంక్రాంతికి సంద‌డి చేయ‌నున్న ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ నుంచి ‘బృందావ‌నం నుంచి.. ’ సాంగ రిలీజ్‌ 
 
 
దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్.. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. సోమ‌వారం ఈ చిత్రం నుంచి ‘బృందానం నుంచి కృష్ణుడు వ‌చ్చాడే.. య‌మునా తీరాన ఉన్న రాధ‌ను చూశాడే..’ అనే పాట‌ను రిలీజ్ చేశారు. 
 
కాలేజ్ ఫంక్ష‌న్‌లో హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ స్టేజ్‌పై పెర్ఫామ్ చేసేలా పాట‌ను అద్భుతంగా చిత్రీకరించారు. గోపిక‌మ్మ గెట‌ప్‌లో అనుప‌మ‌.. కృష్ణుడు క‌న్నెపిల్ల‌ల మ‌న‌సుల‌ను దోచె దొంగ అంటూ సాగే ఈ పాట ఆద్యంతం విన‌సొంపుగా ఉంది. ఈ సాంగ్‌లో హీరో ఆశిష్ కూడా క‌నిపిస్తారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సూప‌ర్బ్ ట్యూన్‌కు సుద్దాల అశోక్ తేజ పాట‌ను రాయ‌గా.. సింగ‌ర్ మంగ్లీ శ్రావ్యంగా ఆల‌పించారు. 
 
 
కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఇప్ప‌టికే విడుద‌లైన ‘రౌడీ బాయ్స్’ సినిమాలో సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ‘బృందావ‌నం నుంచి కృష్ణుడు వ‌చ్చాడే ..’ సాంగ్.. ఈ సినిమా నుంచి విడుదలైన పాట‌ల‌కు డిఫరెంట్‌గా ఉంది.. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. అన్నీ ఎలిమెంట్స్‌తో ‘రౌడీ బాయ్స్’ చిత్రాన్ని యూత్ సహా అందరినీని మెప్పించేలా హిట్ చిత్రాల నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్.. డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష‌, దేవిశ్రీప్ర‌సాద్‌, మ‌ది అండ్ టీమ్‌తో  రూపొందించారు.