Real Star Upendra & R Chandru’s ‘Kabza’: First Look of ‘Kabza’ unveiled

Real Star Upendra & R Chandru’s ‘Kabza’: First Look of ‘Kabza’ unveiled

తెలుగులో రియల్ స్టార్ ఉపేంద్ర, ఆర్. చంద్రు కాంబినేషన్‌లో తాజా సినిమా ‘కబ్జా’ ఫస్ట్ లుక్ విడుదల

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న తాజా సినిమా ‘కబ్జా’. శ్రీధర్ లగడపాటి సమర్పణలో శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఆర్. చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ‘బ్రహ్మ’, ‘ఐ లవ్యూ’ చిత్రాల తర్వాత ఉపేంద్ర, చంద్రు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 నుండి 1980 మధ్య కాలంలో సాగే కథతో, అండర్‌వరల్డ్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ఏడు భాషల్లో పాన్ ఇండియన్ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగులో సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఆనాటి బైక్ మీద ఉపేంద్ర లుక్ రాయల్‌గా ఉందని, ఫస్ట్ లుక్‌లో రెట్రో ఫీల్ ఉందని ఉప్పి అభిమానులతో పాటు ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

‘ఓం’, ‘ఎ’, ‘రా’… ఇలా వైవిధ్యమైన, విలక్షణ కథలతో ఉపేంద్ర పాత్ బ్రేకింగ్ మూవీస్ చేశారు. కన్నడ సహా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. మాఫియా నేపథ్యంలో చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో ‘కబ్జా’ విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత ఆర్. చంద్రు మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకుల నుండి ‘కబ్జా’ ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్భుత స్పందన రావడం సంతోషంగా ఉంది. సినిమాకూ అదే స్థాయిలో స్పందన వస్తుందని నమ్ముతున్నా. హీరో క్యారెక్టరైజేషన్, అందులో ఉపేంద్రగారి నటన, కథ సినిమాకి హైలైట్ అవుతాయి. ఇప్పటికి సుమారు 30 శాతం సినిమా పూర్తయింది. ప్రస్తుతం కరోనా కారణంగా చిత్రీకరణకు విరామం ఇచ్చాం. దేశంలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొని, అందరూ చిత్రీకరణలు ప్రారంభించిన తర్వాత మేం కూడా చిత్రీకరణ ప్రారంభిస్తాం. సుమారు 70 నుండి 80 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఏడు భాషల్లో సినిమాను విడుదల చేస్తాం. జగపతిబాబుగారు సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఉపేంద్ర సరసన అగ్ర హీరోయిన్ నటిస్తారు. ఆవిడ ఎవరనేది త్వరలో చెబుతాం” అని అన్నారు.

సినిమా సాంకేతిక వర్గం…
పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
లైన్ ప్రొడ్యూసర్: ఆర్. రాజశేఖర్
కో డైరెక్టర్: శ్రీ మంజునాథ
ఆర్ట్ డైరెక్టర్: కె.శివ కుమార్
ఎడిటర్: మహేష్
కొరియోగ్రాఫర్: రాజు సుందరం, గణేష్ ఆచార్య, శేఖర్
స్టంట్స్: రామ్-లక్ష్మణ్, కె. రవి వర్మ
క్రియేటివ్ హెడ్: మౌర్య మంజునాథ
సినిమాటోగ్రాఫర్: ఎ.జె. శెట్టి
స్టోరీ: ఆర్. చంద్రు, కె. రామ్ శ్రీ లక్ష్మణ్
మ్యూజిక్ డైరెక్టర్: రవి బస్రు
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మునింద్ర కె. పుర
నిర్మాత-దర్శకుడు: ఆర్. చంద్రు

Real Star Upendra & R Chandru’s ‘Kabza’: First Look of ‘Kabza’ unveiled

‘Kabza’ is the latest film coming from Sandalwood Real Star Upendra. Presented by Sridhar Lagadapati, this one is presented by Sri Siddeshwar Enterprises. Directed by acclaimed helmer R Chandru, this is one more film in the actor-director combination after ‘Brahma’ and ‘I Love You’.

The period film’s story unfolds from 1947 until 1980. An underworld action-drama, this big-budgeted pan-Indian flick will be released in seven languages. The First Look of the Telugu version is out and it’s stylish beyond words. Uppi’s fans are thrilled to see the dazzling star’s swag on a bike. The FL has got a retro feel, too.

Upendra has always made pathbreaking experiments, be it ‘OM’, ‘A’, ‘Raa’ or other movies. He enjoys fan following not just in Kannada but also in Telugu, Tamil and Malayalam. Since ‘Kabza’ has got a mafia backdrop, expectations from it are high. It will hit the screens in Telugu, Kannada, Tamil, Hindi, Malayalam, Odiya and Marathi.

Talking about the crazy project, R Chandru says, “We are glad that the Telugu audience have given a thumbs-up to the First Look of ‘Kabza’. We are confident that the film, too, will get a huge response. The hero’s characterization, Upendra garu’s performance, and the story will stand out as the film’s biggest highlights. Almost 30 percent of the shoot is over. We have given a pause because of the lockdown. We will resume the shoot once things return to normalcy. We are making ‘Kabza’ on a budget of Rs 70-80 Cr. Jagapathi Babu garu has got a major role in the movie. A top actress will be cast opposite Upendra garu. We will reveal her name soon.”

Technical Departments:

PRO: Surendra Kumar Naidu-Phani Kandukuri (Beyond Media)
Line Producer: R Rajasekhar
Co-Director: Sri Manjunatha
Art Director: K Siva Kumar
Editor: Mahesh
Choreographer: Raju Sundaram, Ganesh Acharya, Sekhar
Stunts: Ram-Lakshman, K Ravi Varma
Creative Head: Mourya Manjunatha
Cinematographer: AJ Shetty
Story: R Chandru, K Ram Sri Lakshman
Music Director: Ravi Basru
Executive Producer: Munindra K Pura
Producer-Director: R Chandru