Ravi Teja, Vakkantham Vamsi Film Confirmed

 

కాంబినేషన్‌ షురూ

ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘క్రాక్‌’ చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తున్నారు. అలాగే రవితేజ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ఇటీవల ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా అల్లు అర్జున్‌ ‘నాపేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన రైటర్‌ వక్కంతం వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటింబోతున్నారన్న ప్రకటన శుక్రవారం వెల్లడైంది. గతంలో రవితేజ హీరోగా నటించిన సినిమాలకు వంశీ రచయితగా వర్క్‌ చేశారు. ఈ సినిమా గురించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.