Rakul Preet Singh Interview News

Rakul Preet Singh Interview News

ఎన్‌.జి.కె ఇంటెన్స్‌తో కూడిన మంచి పొలిటికల్‌ థ్రిల్లర్‌ – హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. 

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, లౌక్యం, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, లాంటి సూపర్‌ హిట్‌ మూవీస్‌లో అటు గ్లామరస్‌గా కనిపిస్తూనే ఇటు నటనతోనూ అందరి ప్రశంసలతో తెలుగు, హిందీ, తమిల్‌, భాషల్లో నటిస్తోంది పంజాబీ భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తాజాగా సూర్య హీరోగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన ‘ఎన్‌.జి.కె.(నంద గోపాల కృష్ణ)’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ అందిస్తున్నారు. ఈ చిత్రం మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంటర్వ్యూ.. 

ఈ సినిమాలో మీ క్యారెక్టర్‌ గురించి? 
– ఎన్‌.జి.కె అనేది ఒక క్రిటికల్‌ థ్రిల్లర్‌. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ పేరు వానతి. ఒక పొలిటికల్‌ సినారియోలో ఉన్న క్యారెక్టర్‌. చాలా స్ట్రాంగ్‌. ఒక మంచి లీడర్‌కు ఉండవలసిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆమె మైండ్‌లో ఎం ఆలోచిస్తుంది అనేది ఆమెకు మాత్రమే తెలుసు. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్‌ నేను ప్లే చేయలేదు. 

దర్శకుడు శ్రీ రాఘవతో వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంటుంది? 
-శ్రీ రాఘవ సర్‌తో పని చేసిన వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన షూట్‌ చేసిన స్టైల్‌, క్యారెక్టరైజేషన్స్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన సెట్లో క్లాప్‌ ఉండనే ఉండదు. ఎందుకంటే క్లాప్‌ చూస్తే యాక్టర్స్‌కి డిప్రెషన్‌ వస్తుంది. ఎంత పెద్ద డైలాగ్‌ చెబుతున్నా సరే ఐస్‌ బ్లింక్‌ చేయకూడదు. నేననే కాదు అందరూ యాక్టర్స్‌కి ఇదే రూల్‌. అయన కాన్సెప్ట్‌ అర్ధం చేసుకోవడానికి మూడు రోజులు పట్టింది. అలాగే ఇంకో మూడు సెకండ్స్‌ రూల్‌ ఉంది. అదేంటంటే యాక్షన్‌ చెప్పిన తరువాత త్రీ సెకండ్స్‌ ఆగి డైలాగ్‌ చెప్పాలి. ఇద్దరు యాక్టర్స్‌ మాట్లాడుతున్నప్పుడు కూడా త్రీ సెకండ్స్‌ గ్యాప్‌ ఇచ్చి మళ్లీ డైలాగ్‌ చెప్పాలి. కారణాలేమైనా కావొచ్చు కానీ ఒక యాక్టర్‌కి ఇవి న్యూ వేవ్‌ ఆఫ్ షూటింగ్‌ అనే చెప్పాలి. 

ఆ రూల్స్‌ ఎందుకని మీరు అడిగారా? 
– అడిగాను ఒక యాక్టర్‌ డైలాగ్‌ చెపుతున్నపుడు ఐస్‌ బ్లింక్‌ చేస్తే పెద్ద స్క్రీన్‌ మీద ఆ డైలాగ్‌ ఆడియన్స్‌కి డిస్కనెక్ట్‌ అవుతుంది అని చెప్పారు. అలాగే ఎక్కువ బ్రీతింగ్‌ చేస్తే బాడీ మూమెంట్‌ అవుతుంది అలా చెయ్యొద్దు. అందుకనే ఆయన సినిమాలు చూస్తే ప్రతి క్యారెక్టర్‌ లోనూ ఒక రకమైన ఇంటెన్సిటీ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌ తమ కళ్ళతోనే మాట్లాడగలవు. అందుకే ఆ పాత్రలు ఏమి ఆలోచిస్తున్నాయో ఎవ్వరికి తెలీదు అంత జాగ్రత్తగా ఉంటుంది. ఇక త్రీ సెకండ్స్‌ రూల్‌ ఎందుకంటే టేక్‌ చెప్పగానే డైలాగ్‌ చెప్తే మనం ఇప్పుడు డైలాగ్‌ చెప్పడానికి రెడీగా ఉన్నాం అని తెలుస్తుంది. అలా కాకుండా ఒక త్రీ సెకండ్స్‌ వెయిట్‌ చేసి చెపితే ఆడియన్స్‌ అది ఫీల్‌ అవ్వరు అని చెప్పారు. 

ఈ క్యారెక్టర్‌ కోసం ఏమైనా రీసెర్చ్‌ చేసారా? 
– రీసర్చ్‌ అంటూ ఏమి చేయలేదు. అలాగని మనం ముందే ప్రెపేర్డ్‌గా వెళ్లినా సరే దర్శకుడు మనల్ని వేరే ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాడు. అందుకే ప్రతి రోజు ఒక బ్లాంక్‌ స్లేట్‌లా షూట్‌కి వెళ్లే దాన్ని. అప్పుడే ఆయన చెప్పింది మనం జాగ్రత్తగా చేయగలం. అందుకే ప్రతి ఒక్కరు ఒకసారైనా శ్రీ రాఘవ దర్శకత్వంలో పని చేస్తే వాళ్ళ పెర్ఫామెన్స్‌ ఎన్‌హన్స్‌ చేసుకోవచ్చు. నాకు అలాంటి అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతున్నాను. 

సూర్యతో ఫస్ట్‌ టైం వర్క్‌ చేస్తున్నారు కదా ఎలా అనిపించింది? 
– వెరీ నైస్‌. సూర్య గారు ఎక్స్‌ట్రీమ్‌లీ స్వీట్‌. అంత పెద్ద స్టార్‌ అయినా కూడా చాలా డీసెంట్‌గా ఉంటారు. సూర్యసర్‌ కన్నా ముందే నేను షూట్‌కి వెళ్ళాను. నీకు ఓకే నా నాకే కష్టం అవుతోంది నీకు తమిళ్‌ రాదు కదా యాక్టింగ్‌ ఏమైనా ఇబ్బంది అవుతోందా అని అన్నారు. అంత జాగ్రత్తగా చూస్తారు. అయన సెట్‌ లో ప్రతి ఒక్కరు బావుండాలి అనుకుంటారు. 

సాయి పల్లవి మీ కాంబినేషన్‌లో సీన్స్‌ ఉన్నాయా? 
– ఉన్నాయండి. ఈ సినిమాలో మా ఇద్దరి కాంబినేషన్‌లో నాలుగైదు సీన్లు ఉన్నాయి. సాయి పల్లవి కూడా చాలా బాగా చేసింది. ఆమె కూడా చాలా టాలెంటెడ్‌ యాక్ట్రెస్‌… 

యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్‌ గురించి? 
– ఇదిఒక ఇంటెన్స్‌ ఉన్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ కావడంతో ఈ సినిమాలో ఒకే పాట ఉంది. అది నాకు సూర్య సర్‌కి మధ్య ఉండే రొమాంటిక్‌ సాంగ్‌. ఆ సాంగ్‌కి ఆడియన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా చాలా బాగుంది. 

తెలుగులో ఈ మధ్య చాలా గ్యాప్‌ తీసుకున్నారు? 
– ప్రతేకమైన రీజన్‌ అంటూ ఏమి లేదు. ఒక సంవత్సరంలో 365 డేస్‌ ఉంటాయి. అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నపుడు కొంచెం గ్యాప్‌ రావడం సహజమే.. అలాగే ఈ సంవత్సరంలో నావి అన్ని భాషలలో కలిపి ఆరు సినిమాలు విడుదలవుతాయి. 

ఈ మధ్య అజయ్‌ దేవగన్‌ ఒక ప్రెస్‌ మీట్‌లో బాలివుడ్‌ ఫ్యూచర్‌ రకుల్‌ అన్నారు కదా? 
– అవును. ఈ మధ్యే నేను అజయ్‌ దేవగన్‌ కలిసి నటించిన ‘దే దే ప్యార్‌ దే’ మూవీ రిలీజ్‌ అయ్యి మంచి హిట్‌ అయ్యింది. ఆ సినిమాలో నా క్యారెక్టర్‌ కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఆ సినిమా కోసమే దాదాపు ఆరు నెలలు కష్టపడి చేశాను. ఎందుకంటే ఆ స్క్రిప్ట్‌ పొటెన్షియల్‌ ఏంటో నాకు తెలుసు. కానీ ఇంతరెస్పాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. అన్ని ఇండస్ట్రీల నుండి ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు. అలాగే ఆ ఆర్టికల్‌ నిజమైతే చాలా బాగుంటుంది.(నవ్వుతూ) 

మన్మధుడు 2 షూటింగ్‌ ఎలా ఉంది? 
– చాలా బాగుంది. నాగ్‌ సర్‌తో కలిసి నటించడం చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్‌. సినిమా స్టోరీ అయితే నేను రివీల్‌ చేయలేను కానీ నా క్యారెక్టర్‌ చాలా యంగ్‌ రోల్‌. సినిమా చాలా బాగా వస్తోంది. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. అంటూ ఇంటర్వ్యూ ముగించింది హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌