Mismatch’s teaser is very interesting – victory Venkatesh

Mismatch’s teaser is very interesting – victory Venkatesh

Mismatch's teaser is very interesting - victory Venkatesh

అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థలో తొలి చిత్రం గా ‘మిస్ మ్యాచ్’ పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. మిస్ మ్యాచ్ చిత్ర టీజర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేసారు. 
ఈ సందర్బంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ…మిస్ మ్యాచ్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. చిత్ర యూనిట్ కు గుడ్ లక్. మిస్ మ్యాచ్  ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్ కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. కథ అందించిన భూపతిరాజ గారికి డైరెక్టర్, నిర్మాతలకు బెస్ట్ ఆఫ్ లక్ తెలుపుతున్నా” అన్నారు.
డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ మాట్లాడుతూ… విక్టరీ వెంకటేష్ గారు మా చిత్ర టీజర్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్నఅన్నారు
నా మొదటి సినిమా ఆటకథరా శివ సినిమాకు వెంకటేష్ గారు సపోర్ట్ చేశారు. మళ్ళీ ఈ సినిమా టీజర్ ఆయన చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు. భూపతిరాజ గారు ఇచ్చిన కథను దర్శకుడు బాగా తీశారు. నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు అన్నారు హీరో ఉదయ్ శంకర్.
నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ…వెంకీ గారు ఈ టీజర్ రిలీజ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. ఆడియన్స్ కోరుకుంటున్న అన్నీ అంశాలు సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు. ఉదయ్ శంకర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించారు. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియజేస్తాము”అన్నారు.
రచయిత భూపతి రాజా మాట్లాడుతూ..”ఈ సినిమా రెండు కుటుంభాల మధ్య జరిగే కథ. హీరో హీరోయిన్ లు పోటీ పడి నటించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకుడు ఎన్.వి.నిర్మల్ కు ధన్యవాదాలు. ఈ చిత్రం మిమ్మల్ని ఆలరిస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.
ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం
దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ . 

నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్