మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య‌` నుంచి `లాహే లాహే.. ` సాంగ్ రిలీజ్‌… ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌

మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య‌` నుంచి `లాహే లాహే.. ` సాంగ్ రిలీజ్‌… ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌

మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య‌` నుంచి `లాహే లాహే.. ` సాంగ్ రిలీజ్‌… ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ ‌!!
 
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌ధారిగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తోన్న భారీ చిత్రం `ఆచార్య‌`. బుధ‌వారం ఈ సినిమాలో `లాహే లాహే…` అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. 
 
హైద‌రాబాద్ శివారు ప్రాంతం కోకాపేట‌లో వేసిన టెంపుల్ సెట్‌లో ఈ `లాహే లాహే..` సాంగ్‌ను చిత్రీక‌రించారు. ప‌ర‌మేశ్వ‌రుడిని స్తుతిస్తూ ఈ పాట‌ను పిక్చ‌రైజ్ చేశార‌ని, అందుకు త‌గిన‌ట్లు ప్ర‌ముఖ లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య శాస్త్రి  అద్భుత‌మైన లిరిక్స్‌ను అందించారు. ప‌ర‌మేశ్వ‌రుడి రూపాన్ని త‌న పాట‌తో పొగుడుతూ దాన్ని మెగాస్టార్ చిరంజీవికి మ్యాచ్ అయ్యేలా రాయ‌డం రామ‌జోగ‌య్య శాస్త్రికే చెల్లుతుంది అనేలా పాట‌ను అందంగా రాశారు. 
 
మెగాస్టార్ డాన్స్‌కుండే క్రేజే వేరు. ఎలాంటి క‌ష్ట‌మైన స్టెప్‌నైనా అల‌వోక‌గానే కాదు.. అందంగానూ వేసే మెగాస్టార్ ఈ సినిమాలో త‌న‌దైన డాన్సింగ్ చ‌మ‌క్కులు చూపించ‌డం ఖాయ‌మ‌ని చెప్పేలా ఈ లిరిక‌ల్ సాంగ్‌లో చిన్న డాన్స్ బీట్ ఉంటుంది. ఈ పాట‌లో కాజ‌ల్‌, న‌టి సంగీత కూడా ఉండ‌టం కొస‌మెరుపు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ సినిమాలోని ఈ పాట‌ను హారిక నారాయ‌ణ్‌, సాహితీ ఆల‌పించారు. ఫోక్ సాంగ్‌.. సెమీ క్లాసిక్ ఫార్మేట్‌లో ఈ పాట ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట‌కు ప్రేక్ష‌కాభిమానుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. మే 13న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. 
 
న‌టీన‌టులు:
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే, సోనూసూద్ త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం:
 
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  కొర‌టాల శివ‌
బ్యాన‌ర్స్‌:   కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ 
నిర్మాత‌లు:  నిరంజ‌న్ రెడ్డి, రామ్ చ‌ర‌ణ్‌
మ్యూజిక్‌:  మణిశ‌ర్మ‌
సినిమాటోగ్ర‌ఫీ:  ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  సురేష్ సెల్వరాజ్‌
ఎడిట‌ర్‌:  న‌వీన్ నూలి