Majjili pre release event

Majjili pre release event

Majjili pre release function

`మ‌జిలీ` ప్రీ రిలీజ్!!

నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం `మ‌జిలి`. శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. సాహు గార‌పాటి , హ‌రీష్ పెద్ది నిర్మాత‌లు. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక హైద‌రాబాద్ లో ఆదివారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్ట‌రీ వెంక‌టే ష్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ , బిగ్ సీడీల‌ను లాంచ్ చేశారు.
ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.“ మ‌జిలీ అనేది అందమైన హాల్ట్ . 20ఏళ్ల వ‌య‌సులో ఎంతైనా ప‌రుగెడ‌తాం. అదే 40 ఏళ్ల వ‌య‌సులో అంత ప‌రుగెట్ట‌లేం. అందుకే ఎంత పరుగెట్టాలి , ఎంత కంపోజ్డ్ గా ఉండాల‌ని చెప్పేదే మ్యారేజ్‌. ఈ మొత్తం ప్ర‌యాణంలో నువ్వు సేద తీరే ఓ పాయింట్ నే పెళ్లి అని పేరు పెట్టాం. నిన్నుకోరి త‌ర్వాత జాన‌ర్ మారుద్దామ‌నుకున్నా, కానీ నాగ చైత‌న్య గారు నీ సినిమా చూసాను నాకు బాగా న‌చ్చింది, మంచి పాయింట్ ఉంటే తీసుకురండీ చేద్దాం అన్నారు. అప్పుడు త‌ట్టిందే మ‌జిలీ పాయింట్. స‌మంత గారు, చైతు గారు ఇద్ద‌రు అయితే ఆ పాయింట్ కి బావుంటార‌ని పెట్టాం త‌ప్పా, ఏదో మార్కెట్ చేసుకోవాల‌ని కాదు. మా నిర్మాత‌లు న‌మ్మి ఈ సినిమా చేసార‌న్నారు.
సాహు మాట్లాడుతూ…“ ఈ సినిమాకు చైతుగారు, సాహు గారు అందించిన స‌పోర్ట్ వ‌రువ‌లేనిది“ అన్నారు.
స‌మంత అక్కినేని మాట్లాడుతూ…“ మ‌జిలీ నిజ‌మైన ల‌వ్ స్టోరి. ల‌వ్ అంటే బ‌లం. లవ్ అంటే ధైర్యం. ప్రేమంటే బాధ్య‌త‌. ఏమాయే చేసావే త‌ర్వాత నాకు ఇంపార్టెంట్ అయిన సినిమా మ‌జిలీ అవుతుంద‌న్నారు.
నాగ‌చైత‌న్య మాట్లాడుతూ…“నేను, శ్యామ్ పెళ్లి త‌ర్వాత క‌లిసి సినిమా చేయ‌లేదు. మేము ఇద్ద‌రం క‌లిసి ఎలాంటి సినిమా చేద్దాం అనుక‌న్నామో అలాంటి సినిమా ఇచ్చారు శివ‌. త‌న డైర‌క్ష‌న్ లో సినిమా చేయ‌డం చాలా హ్యాపీ గా అనిపించింది. సినిమా పై చాలా న‌మ్మ‌కంతో ఉన్నాం“ అన్నారు.
వెంక‌టేష్ మాట్లాడుతూ…“ మ‌జిలీ టీజ‌ర్ చూడ‌గానే సినిమా పెద్ద హిట్ అవుతుంద‌నిపించింది. శివ చెప్పాల‌నుకున్న‌ది క్లియ‌ర్ గా చెప్పాడు. ఏప్రిల్ 5న వ‌స్తోన్న ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని “ అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ…“మ్యూజిక్ ఇప్ప‌టికే స‌క్సెస్ అయింది. ట్రైల‌ర్ చూస్తుంటే ఒక‌సారి జివ్వుమంది. బాధ క‌లిగింది. అంద‌రికీ క‌నెక్ట‌య్యేలా ఉంది. ఈ నెల 5న వ‌స్తోంది క‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంది“ అన్నారు.