Koratala Siva Released Nee Kannu Neeli Samudram Song From Vaisshnav Tej’s Uppena

Koratala Siva Released Nee Kannu Neeli Samudram Song From Vaisshnav Tej’s Uppena

 

‘ఉప్పెన’లో ‘నీ కన్ను నీలి సముద్రం’ పాటను లాంచ్ చేసిన కొరటాల శివ

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే పాటను సూపర్ డైరెక్టర్ కొరటాల శివ  సోమవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుకుమార్, వైష్ణవ్ తేజ్, బుచ్చిబాబు పాల్గొన్నారు. శ్రీమణి రాసిన ఈ పాటను జావెద్ అలీ ఆలపించారు.

అనంతరం  కొరటాల శివ మాట్లాడుతూ, “ఈ వేసవికి ఇంతకంటే చల్లనైన, చక్కనైన సినిమా రాదనేది నా ప్రగాఢ నమ్మకం. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ కథ ఫస్టాఫ్ ఒకసారి, సెకండాఫ్ ఒకసారి చెప్పాడు. అతను కథ చెప్పిన విధానం, ఆ డీటైలింగ్ చూసి ఈ సినిమా ఏ రేంజిలో ఉంటుందోనని అప్పుడే అనిపించింది. ప్రతి ఫ్రేం ను తను ముందే చూశాడు. నాకు తెలిసి ఇంత చక్కని విలేజ్ లవ్ స్టోరీ ఈ మధ్య కాలంలో రాలేదు. నన్ను బాగా ఇన్ స్పైర్ చేసిన సినిమా ‘సీతాకోకచిలక’.  అది నా చిన్నతనంలో వచ్చింది. నిజాయితీగా చెబ్తున్నా.. అలాంటి ఫీల్ ఉన్న సినిమా ‘ఉప్పెన’ అని నేను నమ్ముతున్నా. ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్ చాలా బాగుంది. దేవి శ్రీప్రసాద్ సంగీతం గురించి చెప్పాల్సింది ఏముంటుంది! కథకు దేవి మ్యూజిక్ తోడైతే సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోయింది. వైష్ణవ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ వండర్ఫుల్. చాలా చార్మింగ్ గా ఉన్నాడు. అతను స్క్రీన్ మీద కనిపిస్తుంటే, పక్కన అందమైన హీరోయిన్ ఉన్నా సరే, కళ్లు అతనివేపే ఉంటున్నాయి. వైష్ణవ్ కు ఇంతకంటే బెటర్ డెబ్యూ రాదనుకుంటున్నా. అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నా. ఈ సినిమాకు పనిచేసిన అందరు నటీనటులకు, సాంకేతికి నిపుణులకు నా శుభాకాంక్షలు. ‘ఉప్పెన’ పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని చెప్పారు.

ఇదివరకు విడుదల చేసిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్లకు అనూహ్య స్పందన లభించింది. అలాగే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్న తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ పోస్టర్ కు కూడా మంచి స్పందన లభించింది.

ఏప్రిల్ 2న ‘ఉప్పెన’ను విడుదల చేయడానికి నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సన్నాహాలు చేస్తున్నారు.

ప్రధాన తారాగణం:
పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ

సాంకేతిక వర్గం:
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: శాందత్ సైనుద్దీన్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: మౌనిక రామకృష్ణ
పీఆర్వోలు: వంశీ-శేఖర్, మధు మడూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై., అశోక్ బి.
సీఈఓ: చెర్రీ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
కథ, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్

 
Koratala Siva Released Nee Kannu Neeli Samudram Song From Vaisshnav Tej’s Uppena

Star director Koratala Siva who made blockbusters under Mythri Movie Makers has released first song of Uppena that marks debut of Vaissnav Tej, Krithi Shetty and Buchi Babu Sana as hero, heroine and director respectively.

The first song Nee Kannu Neeli Samudram is a wonderful Qawwali composed by Devi Sri Prasad. The love story of the lead pair Vaissnav Tej and Krithi Shetty which begins at a Dargah when they are kids is shown exquisitely.

The song is an instant chartbuster with passionate singing from Javed Ali and Srikanth Chandra. The Hindi lyrics by Raqueeb Alam and Telugu lyrics by Shreemani give emphasis to Tej’s adoration on Shetty. Nobody can beat DSP when it comes to soothing melodies and he proves the same another time.

The song launch is attended by Sukumar who’s the production partner of the film.

Koratala Siva said, “Uppena is going to create a storm this summer. It’s a cool and wonderful film. When Buchi first came to narrate me the story, I really liked his detailing and could watch every frame. After long time after Seethakoka Chiluka, Uppena is such a beautiful rural backdrop romantic entertainer. Vaishnav Tej is highly charming. He can’t get better debut than this. I wish all the very best to the entire cast and crew of the film.”

Popular Tamil star Vijay Sethupathi plays an important role in the flick directed by Buchi Babu Sana.

‘Rockstar’ Devi Sri Prasad is composing music while Shamdat Sainudeen is handling the cinematography.

Mythri Movie Makers is producing ‘Uppena’ in association with Sukumar Writings banner.

Cast: Panja Vaisshnav Tej, Vijay Sethupathi, Kriti Shetty, Sai Chand, Brahmaji

Crew:
Story & Direction: Buchi Babu Sana
Producers: Naveen Yerneni, Y Ravi Shankar
Executive Producer: Anil Y & Ashok B
CEO: Cherry
Banner: Mythri Movie Makers, Sukumar Writings
Cinematography: Shamdat Sainudeen
Music director: Devi Sri Prasad
Editor: Naveen Nooli
Art Director: Mounika Ramakrishna
Pro: Vamsi Shekar, Madhu Maduri