‘Heza’ is a Musical Horror in Post Production .. !!

‘Heza’ is a Musical Horror in Post Production .. !!
'Heja' is a Musical Horror in Post Production .. !!

పోస్ట్ ప్రొడక్షన్ లో   ‘హేజా ‘ ఎ మ్యూజికల్ హారర్ ..!!

 
మిస్టర్ 7, చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని మంచి ప్రశంసలు పొందారు  మున్నా కాశీ.  ఆయన   హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న  చిత్రం “హేజా”.  (ఎ మ్యూజికల్ హారర్).  వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై  కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ముమైత్ ఖాన్, నూతన నాయుడు( బిగ్ బాస్ ఫేమ్),ల‌క్ష్మ‌న్(ఆర్.ఎక్స్ 100ఫేమ్). లిజి గోపాల్, ప్రీతం  నిగమ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ ని అందించారు.. మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్   విడుదలై  మంచి రెస్పాన్స్ తో  సోషల్ మీడియాలో  ట్రెండింగ్ లో ఉంది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగాజరుగుతున్నాయి. ఈ సందర్భంగా..
 
దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ…  ఇప్పటి వరకు చాల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాను.. ఫస్ట్ టైమ్‌ హీరోగా, దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా ఇది..  ఒక మ్యూజికల్ హారర్ గా అధ్బుతమైన కథాంశంతో తెరెక్కుతున్న చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్ కి ఆడియన్స్ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ తో పాటు ఆర్.ఆర్ హైలెట్ గా నిలవనుంది.  టెక్నికల్ గా హై రేంజ్ లో ఉండే చిత్రం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన స‌హ‌నిర్మాత  వి.య‌న్ వోలెటి, నిర్మాత  కెవిఎస్ఎన్ మూర్తి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా అత్యాధునిక 5.1 మిక్సింగ్,  డాల్బీమిక్సింగ్ తో రూపొందుతోంది. ఈ సినిమా కి సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు. ఈ సినిమా తో ముమైత్ ఖాన్ గారురీఎంట్రీ ఇస్తున్నారు. సినిమా అవుట్ ఫుట్ చాల బాగా వచ్చింది. ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నాం” అన్నారు.
 
నిర్మాత  కెవిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ.. ఇప్పటివరకు వచ్చిన అన్ని హారర్ సినిమాలకు డిఫరెంట్ గా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.   ఎంతో క్లారిటీగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సినిమా ఉంటుంది. అలాగే టెక్నికల్ గా కూడా బాగా రావడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ హాలీవుడ్ రేంజ్లో ఉందంటూ అటు ప్రేక్షకులు ఇటు ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ సినిమాలో నటి ముమైత్ ఖాన్ క్యారెక్టర్  గత చిత్రాలకు  సంబంధం లేకుండా సంథింగ్ స్పెషల్ అనేలా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి త్వరలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి విలేకరుల సమావేశం నిర్వహించి విడుదల తేదీని ప్రకటిస్తాం” అన్నారు.
 
నటీనటులు : మున్నా కాశి , ముమైత్ ఖాన్, నూతన నాయుడు, ల‌క్ష్మ‌న్(ఆర్.ఎక్స్ 100), లిజి గోపాల్, ప్రీతం నిగమ్ తదితరులు…
 
సాంకేతిక నిపుణులు :
ప్రొడ్యూసర్:-   కెవిఎస్ఎన్ మూర్తి
స‌హ‌నిర్మాత:-   వి.య‌న్ వోలెటి
బ్యానర్ :  వి.ఎన్.వి క్రియేషన్స్
స్టోరీ – స్క్రీన్ ప్లే -మ్యూజిక్ -డైలాగ్స్ -డైరెక్షన్ – మున్నా కాశీ
మ్యూజిక్ :  మున్నా కాశీ అలియాస్ కె.వి.ఎస్.ఎన్ మూర్తి,
సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి 
ఎడిటర్ : గ్యారీ బి హెచ్ 
పి.ఆర్.ఓ : సాయి సతీష్