‘నా కోసం…’ అంటూ మెస్మ‌రైజ్ చేస్తున్న‘నిన్నిలా నిన్నిలా’ ల‌వ్ మెలోడి

‘నా కోసం…’ అంటూ మెస్మ‌రైజ్ చేస్తున్న‘నిన్నిలా నిన్నిలా’ ల‌వ్ మెలోడి

`నా కోసం`… అంటూ మెస్మ‌రైజ్ చేస్తున్న‘నిన్నిలా నిన్నిలా’ ల‌వ్ మెలోడి
 
ప్రేమ తీయ‌నైన ఓ అనుభూతి.. అందుక‌నే ప్రేమికులు తెలియ‌ని ఓ భావోద్వేగ ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తుంటారు. అలాంటి ఓ ఎమోష‌న్‌తో ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే వైవిధ‌మ్యైన‌ ప్రేమ క‌థలు ఎప్పుడూ సినీ అభిమానుల‌ను అల‌రిస్తుంటాయి. అలాంటి డిఫ‌రెంట్ ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ జ‌ర్నీని మా సినిమాలో ఫీల్ అవుతార‌ని అంటున్నారు ‘నిన్నిలా నిన్నిలా’ టీమ్‌. 
 
అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్‌ల‌‌పై బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మంగ‌ళ‌వారం ఈ సినిమా నుంచి ల‌వ్ మెలోడిని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. 
 
‘‘ నా కోసం రేయె కొత్తగా పూసెనే
నా దేశం పేరే మెలకువై మెరిసెనె
దారంతా ఏకాంతం
తారలతో సావాసం 
నిదురనె మరచిన భూమిలా
ఇలాకా నాదంటూ ఇలాగే నిదురపొతే..’’ అంటూ సాగే ఈ మెలోడీని శ్రీమ‌ణి రాయ‌గా, రాజేశ్ మురుగేశ‌న్, విజ‌య్ ఏసుదాస్ ఆల‌పించారు. ఈ చిత్రానికి రాజేశ్ మురుగేశ‌న్ సంగీత సారథ్యం వ‌హించారు. 
ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. 
 
 
న‌టీన‌టులు:
అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ  త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: అని.ఐ.వి.శ‌శి 
నిర్మాత‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌
స‌మ‌ర్ప‌ణ‌:  బాపినీడు.బి
సినిమాటోగ్ర‌ఫీ:  దివాక‌ర్ మ‌ణి
సంగీతం:  రాజేశ్ మురుగేశ‌న్‌
పాట‌లు:  శ్రీమ‌ణి
డైలాగ్స్‌:  నాగ చంద‌, అనుష‌, జ‌యంత్ పానుగంటి
ఆర్ట్‌:  శ్రీ నాగేంద్ర తంగాల‌
ఎడిటింగ్‌:  న‌వీన్ నూలి
డైలాగ్స్‌:  నాగ చందు, అనుష, జ‌యంత్ పానుగంటి