‘Anukunnadhi Okkati Ayyindhi Okkati’ press meet

‘Anukunnadhi Okkati Ayyindhi Okkati’ press meet

 

దర్శకులు అందరికీ ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ అంకితం! – బాలు అడుసుమిల్లి

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. సోమవారం ఉదయం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో సినిమా కొత్త ట్రైలర్ విడుదల చేశారు. మార్చి 6న చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక-నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ “సినిమాలోని నలుగురు హీరోయిన్లలో నేను ఒక అమ్మాయిగా నటించాను. ధన్య అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తాను. నా కెరీర్ లో నేను చేసిన ఎక్స్పెరిమెంటల్, ఎక్సైటింగ్ సినిమా ఇది” అని అన్నారు.

సిద్ధీ ఇద్నాని మాట్లాడుతూ “చిన్నప్పటినుండి స్నేహితులైన నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. వినోదాత్మకంగా ఉంటుంది. థియేటర్లలో హాయిగా నవ్వుకోవచ్చు. థియేటర్లకు రండి. సినిమా చూడండి” అని అన్నారు.

త్రిధా చౌదరి మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను ఓ భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో నేను సోలో హీరోయిన్ గా సినిమాలు చేశా. ఫస్ట్ టైం ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లతో కలిసి నటించా. నలుగురు హీరోయిన్లు ఉన్నప్పుడు హీరో అవసరమా? మేం బి సినిమాకు షీరోస్ (SHEros). అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సినిమా ఇది. కథలో హీరోయిన్లు నలుగురు పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది” అని అన్నారు.

కోమలి ప్రసాద్ మాట్లాడుతూ “హీరోయిన్ గా నా సెకండ్ ఫిల్మ్ ఇది. సినిమా చాలా బాగుంటుంది. నెలంతా కష్టపడి అలసిపోయిన ప్రేక్షకులు… మార్చి 6న హాయిగా రెండు గంటలపాటు నవ్వుకోవడానికి మా సినిమా థియేటర్లకు రండి. రెండోసారి మూడోసారి నాలుగోసారి ఎన్నిసార్లైనా చూడొచ్చు. పాప్ కార్న్ తింటూ ఎంజాయ్ చేయవచ్చు” అని అన్నారు.

దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ “ఇన్ని రోజులు మీడియాలో ఒకడిగా, మీడియా సభ్యుల మధ్య ఉన్నాను. ఇప్పుడు మీడియా ముందు నన్ను నిలబెట్టారు. మీడియా నుండి వచ్చి ఒక సినిమాకు దర్శకత్వం వహించడం అనేది పెద్ద స్టెప్. అందులో ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. చాలామంది దర్శకులు కావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకని, దర్శకులు అందరికీ ఈ సినిమాను అంకితం చేస్తున్నా. వినోదంతో కూడిన మంచి కథతో సినిమా తీశా. నా వైఫ్ హిమబిందు నిర్మాతగా మారి ఇ నాకు ఎంతో సపోర్ట్ చేసింది. రఘురామ్ సపోర్ట్ కూడా మరువలేనిది. సినిమా మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఆల్మోస్ట్ మూడు కోట్ల బడ్జెట్ అయ్యింది” అని అన్నారు.

చిత్ర సహనిర్మాత రఘురామ్‌ యేరుకొండ మాట్లాడుతూ “నలుగురు అందమైన అమ్మాయిలతో అందంగా, అద్భుతంగా బాలు గారు సినిమా తీశారు. మార్చి 6న విడుదలవుతోంది. ప్రేక్షకులందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

చిత్ర నిర్మాత హిమబిందు వెలగపూడి మాట్లాడుతూ “బాలు దర్శకుడు అవుతానని చెప్పినప్పుడు షాకయ్యా. కథ విన్న తర్వాత ట్రై చేయమని చెప్పాను. తర్వాత మేమే సినిమా నిర్మించాలనే నిర్ణయానికి వచ్చాము. రఘురామ్ గారు, శ్రీరామ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు” అని అన్నారు.

“సినిమా డబుల్ రొట్టెలా ఉంటుంది” అని నటుడు లోబో అన్నారు.

“సినిమాల్లో బెల్ బాయ్ క్యారెక్టర్ చేశా. నాది కామెడీ రోల్. సిద్ధి ఇద్నాని గారిపై మనసు పారేసుకున్న ఒక బెల్ బాయ్ రోల్” అని నటుడు బాషా అన్నారు.

నటీనటులు:
ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌, రఘుబాబు, హిమజ, రఘు కారుమంచి, సమీర్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు:
అసోసియేట్‌ డైరెక్టర్‌: లక్కీ బెజవాడ, ఎడిటర్‌: తెల్లగుటి మణికాంత్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎల్‌ఎన్‌ వారణాసి, వైజేఆర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: నేహా మురళి, ఆర్ట్‌ డైరెక్టర్‌: గాంధీ నడికుడికర్‌, సినిమాటోగ్రఫీ: శేఖర్‌ గంగమోని, సంగీతం: వికాస్‌ బాడిస, కో–డైరెక్టర్‌, డైలాగ్స్‌: విజయ్‌ కామిశెట్టి, సహ నిర్మాత: రఘురామ్‌ యేరుకొండ, నిర్మాత: హిమ బిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌, రచన, దర్శకత్వం: బాలు అడుసుమిల్లి.

‘Anukunnadhi Okkati Ayyindhi Okkati’ is super fun: Makers say ahead of release on March 6

Coming to entertain you non-stop for two hours on March 6 is ‘Anukunnadhi Okkati Ayyindhi Okkati’, a female-centric film with an exciting story. Produced by Hima Velagapudi and Vegi Srinivas on Black & White Pictures and Poorvi Pictures as Production No. 1, the promising flick is directed by debutant Baalu Adusumilli. Starring Dhanya Balakrishna, Tridha Choudhury, Siddhi Idnani, and Komalee Prasad, the film’s Trailer has successfully made the audience wait for it with curiosity.

Days ahead of his movie’s release, director Balu Adusumilli says, “I thank each and everyone who has made this film possible. I come from a media background. My media friends have now put me in the front. So many individuals are trying their best to get a chance to direct a movie. I am dedicating this maiden venture to all those determined aspirants. A lot of pain has gone into making this movie. Thanks to my wife and Raghuram, I could complete it successfully.”

Dhanya Balakrishna is the leader of her gang of four women in the film. “I have played a software engineer in the movie. It’s an exciting film full of entertainment,” she said.

Komalee Prasad said, “Thank you for the support, media. This is my second film and I am optimistic about the result. Balu is a very hardworking director. When you watch ‘AOAO’, you will realize that it’s pure joy for two hours.”

Tridha Chowdhary said, “We four women have given our best. We are ‘Sheroes’ and we don’t need a hero. This is an experimental as well as an entertaining film whose title is completely justified. It’s a stress-buster of an entertainer.”

Siddhi Idnani said, “The audience make us who we are. We are nothing without you. Coming to the film, we four have played thick friends who share a great bonding. They plan to Goa and what follows is entertainment. I request you all to watch ‘AOAO’ with your friends. Thanks to the joint efforts of technicians and artists, the output is great.”

Basha, the comedian, said that the film has promised superb content through its trailer. “The trailer is very good and it showcases the unique aspect of the film, in which four women plan a Goa trip. We are all used to watching men panning such outings. Here it is different. Dhanya comes with the experience of having acted in 25 movies. Tridha has already proved herself in the past. Komalee is a dentist-turned-actress. She is very talented. Siddhi, Sameer, Lobo and others have done a nice job in the movie. The director is a cool person.”

Lobo said, “At the end of the day, content is what matters the most. Big or small, any film is accepted by the audience if the content is good. Our film is substantial in that respect.”

Hima Velagapudi said, “I was shocked when Balu told me that he wants to try direction. Once he told me the story of ‘AOAO’, I wanted him to give a try. I slowly gained confidence in him as the film started to be made. We need the blessings of the audience.”

Raghuram said, “The four beautiful women have given their best. Director Balu has exceeded our expectations. Our film is coming out on March 6 for your blessings.”

Cast and crew:

Dhanya Balakrishna, Tridha Choudhury, Siddhi Idnani, Komalee Prasad, Raghu Babu, Himaja, Raghu Karumanchi, Sameer and others.

Music: Vikas Badija
DOP: Shekar Ganganamoni
Editor: Thellaguti Manikanth
Art Director: Gandhi Nadikudikar
Associate Director: Lucky Bezawada
Executive Producer: LN Varanasi & YJR
Co-Producers: Neha Muralikirshna, Raghuram Yarukunda
Producers: Hima Velagapudi & Vegi Srinivas
Dialogues & Co-Director: Vijay Kamisetty
Written & Directed by Baalu Adusumilli