Akshatha Srinivas starrer SURABHI-70MM”

Akshatha Srinivas starrer SURABHI-70MM”

 

 

 

                     ‘ఆచార్య దేవోభవ’  అంటున్న అక్షత శ్రీనివాస్ 
 
      చిరంజీవి సూపర్ హిట్ సినిమా ‘అభిలాష’ ఆ అమ్మాయి పేరు.  మరో సూపర్ హిట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’ ఆమె క్యారక్టర్. మెగా స్టార్ చిరంజీవి అంటే అభిలాషకు ఎంత పిచ్చి అంటే.. ‘జై చిరంజీవా’ అంటూ చేతికి పచ్చ బొట్టు పొడిపించుకునేంత.  ఇంతకీ ఈ అభిలాష కథేంటి? చిరంజీవి కోసం చచ్చిపోయేంతగా పెంచుకున్న మెగాభిమానం ఆమెకు చేసిన మేలేంటి? ‘గ్యాంగ్ లీడర్’ గా ఆమె ఎందుకు మారాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ‘సురభి 70 ఎం.ఎం’ చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు వై.గంగాధర్. 
మెగా ఫ్యాన్ గా అందాల భామ అక్షత శ్రీనివాస్ నటిస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం ‘సురభి 70 ఎం.ఎం’ పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
‘సురభి 70 ఎం.ఎం’ అనే ధియేటర్ ను కబ్జా చేసేందుకు ప్రయత్నించే ఓ రౌడీని మెగా ఫ్యాన్ అయిన అక్షత శ్రీనివాస్ తన గ్యాంగ్ తో ఎలా ప్రతిఘటించింది? ఆ క్రమంలో ఆమె ‘గ్యాంగ్ లీడర్’ ఎలా అయ్యింది అనేది ముఖ్య కథ. 
     మెగా ఫ్యాన్ అభిలాషగా నటిస్తున్న యువ కథానాయకి అక్షత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘స్వతహా నిజ జీవితంలో  మెగా స్టార్ కు పెద్ద ఫ్యాన్ అయిన నాకు ‘సురభి ’70 ఎం.ఎం’లో మెగాభిమానిగా గ్లామర్ తోపాటు నటనకు ప్రాధాన్యత కల ‘అభిలాష’ అనే పాత్రలో ‘లేడి గ్యాంగ్ లీడర్’గా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రం నా కెరీర్ ను మలుపు తిప్పుతుందని నమ్మకంగా చెప్పగలను… అన్నారు. నిర్మాణంలో ఉన్న
మెగాస్టార్ తాజా చిత్రం ‘గోవింద్ ఆచార్య’ బాక్సులు బద్దలైపోవాలని కోరుకుంటున్నాను… అన్నారు!!