Actress Karronya Katrynn interview

Actress Karronya Katrynn interview

నా పాత్ర తో ప్రతి అమ్మాయి రిలేట్ అవుతుంది – హీరోయిన్  కారుణ్య కత్రేన్

శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉత్తర’. జనవరి3 న విడుదలకు సిద్దం అయిన ఈ సినిమా యూత్ ని ఆకట్టుకునే అంశాలతో ముస్తాబయ్యింది. ఈ సందర్భంగా హీరోయిన్ కారుణ్య కత్రిన్ మీడియా తో ముచ్చటించారు.

ఈ సందర్భంగా హీరోయిన్ కారుణ్య కత్రేన్ మాట్లాడుతూ:
‘‘నాకు చిన్నతనం నుండి డాన్స్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతో ఆట 5  లో డాన్స్ ర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. నా లైఫ్ లో తొలి విజయం ఆట వేదికనుండే అందుకున్నాను. ఆ తర్వాత కొన్ని సినిమాలలో చైల్డ్ క్యారెక్టర్స్ చేసాను. తర్వాత రాములమ్మ సీరియల్ నాకు మంచి పేరును తెచ్చింది. క్లాసికల్, వెస్ట్రన్, లను మిక్స్ చేసి ఎలాంటి డాన్స్ అయినా చేయగలగడం నాకు నేషనల్ అవార్డ్ ని తెచ్చి పెట్టింది. అది నా జీవితంలో మరపు రాని సంఘటన.. నటనలో నాకు సావిత్రి, శ్రీదేవి గార్లు నా ఇన్సిపిరేషన్ వారిలా పేరు తెచ్చుకోవాలన్నదే నా కొరిక. మా ఇంట్లో వారి ఇష్టం మేరకు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. కానీ నటన నా ప్యాషన్ తెలుగులో  ఇది నా రెండో సినిమా ఉత్తర లో స్వాతి క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నాను. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్యూర్ లవ్ స్టోరీ ఇది, నిజం చెప్పాలంటే ప్రతి ఊరిలో ఒక ఉత్తర ఉంటుంది  కానీ వేరే పేర్లతో ఉంటుంది. అంతలా ఈ క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. నా టాలెంట్ ని షోకేస్ చేసుకునేందుకు ఇందులో‘పిల్లా నా గుండె ను పట్టి లాగకే’ పాట లో నా డాన్స్ మీ అందరికీ  తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను.  మా డెరక్టర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే  ఆయన స్టైయిల్ శేఖర్ కమ్ముల గారిని పోలి ఉంటుంది. చాలా నాచురల్ గా సీన్స్ ని తెరమీదకు తెస్తారు. మేం అంతా రియల్ లోకేషన్స్ లో షూట్ చేసాం.. షూటింగ్ పార్ట్ అంతా చాలా చక్కగా జరిగింది. ఒక మంచి టీం తో పనిచేసాను అనే సంతృప్తి ఉంది. దీనితో పాటు మరో రెండు తెలుగు సినిమాలు చేస్తున్నాను. ఒక తమిళ  సినిమా కు సైన్ చేసాను. ఉత్తర లో స్వాతి క్యారెక్టర్ కాస్త డామినేటింగ్ గా ఉంటుంది. అందమైన అమ్మాయిలకు పోగరు ఉండటం తప్పకాదు అని నమ్మే క్యారెక్టర్ , హీరో కథను నడిపిస్తే అతడ్ని హీరోయిన్ క్యారెక్టర్ నడిపిస్తుంది. వారి మద్య సంభాషణలు చాలా ఫన్ గా ఉంటాయి. వారి ప్రేమకు ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని స్వాతి ఎలా సాల్వ్ చేసుకుంది అనేది ఇంట్రెస్ట్ గా ఉంటుంది. నేను డాన్స్ , సినిమాలలో  పేరు తెచ్చుకోవడానికి కారణం మా తల్లిదండ్రులే. వారి ప్రొత్సాహంతోనే నేను ప్యాషన్ ని కొనసాగించగలుగు తున్నాను. ’’ అన్నారు.

రవి కుమార్ మాదారపు సమర్సణలో లైవ్ ఇన్ సి క్రియేషన్స్ , గంగోత్రి ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించిన ఉత్తర
జనవరి 3 విడుదలకు సిద్దం అయ్యింది. ఈ మవీ  ట్రైలర్ కి మంచి రెస్సాన్ వస్తుంది. ఒక స్వచ్చమైన ప్రేమకథను, రియలిస్టిక్ అప్రోచ్ తెరమీదకు తెచ్చిన ఈమూవీ తప్పకుండా అన్ని వర్గాల వారినీ అలరిస్తుందని అంటుంద చిత్ర యూనిట్.

సమర్పణ: రవికుమార్ మాదారపు.
బ్యానర్స్: లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్స్.
సినిమాటోగ్రఫీ: చరణ్ బాబు
మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి
ఎడిటర్: బొంతుల నాగేశ్వర రెడ్డి
రైటర్: ఎన్. శివ కల్యాణ్
రచన మరియు దర్శకత్వం : తిరుపతి యస్ ఆర్
ప్రొడ్యూసర్స్ : తిరుపతి యస్ ఆర్. శ్రీపతి గంగదాస్.

నటీ నటలు: శ్రీరామ్ నిమ్మల, కారుణ్య కత్రేన్, అజయ్ ఘోష్, వేణు, అభినవ్, అభయ్