Aadi Saikumar ‘Burra Katha’ First Look Matter
ఆది సాయికుమార్ `బుర్రకథ` ఫస్ట్ లుక్
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తోన్నచిత్రం `బుర్రకథ`. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. డిఫరెంట్ షేడ్స్‌తో సరికొత్త హెయిర్ స్టైల్‌తో ఆది ఆకట్టుకుంటున్నాడు. రచయిత డైమండ్ రత్నబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్.కె.శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఒక మనిషికి రెండు మెదళ్లు ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైరే `బుర్రకథ`. కథానుగుణంగానే ఫస్ట్ లుక్‌ను రెండు షేడ్స్‌లో ఉండేలా డిజైన్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రల్లోనటించారు. సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు.
నటీనటులు:
ఆది సాయికుమార్
మిస్తీ చక్రవర్తి
నైరా షా
రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి,
పథ్వీరాజ్
గాయత్రి గుప్తా
అభిమన్యుసింగ్, ఫిష్ వెంకట్
ప్రభాస్ శ్రీను
గీతా సింగ్ తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం : డైమండ్ రత్నబాబు
నిర్మాత: హెచ్.కె.శ్రీకాంత్ దీపాల
నిర్మాణ సంస్థ: దీపాల ఆర్ట్స్
మ్యూజిక్: సాయికార్తీక్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ
స్క్రీన్‌ప్లే: ఎస్.కిరణ్, సయ్యద్, ప్రసాద్ కామినేని, సురేష్ ఆరపాటి, దివ్యభవాన్ దిడ్ల
ఆర్ట్: చిన్నా
సాహిత్యం: శివ శక్తిదత్తా, భాస్కర్ల భట్ల, కె.కె
ఫైట్స్: వెంకట్, సల్మాన్ రాజ్, రియల్ సతీష్
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్