Back door movie news

Back door movie news

“బ్యాక్ డోర్” బ్లాక్ బస్టర్ అవ్వాలి! – లవ్లీ హీరో ఆది సాయికుమార్

    ఆర్కిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం ‘బ్యాక్ డోర్’ ఫస్ట్ లుక్ లవ్లీ హీరో ఆది సాయికుమార్ విడుదల చేశారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన “బ్యాక్ డోర్’ బ్లాక్ బస్టర్ అవ్వాలని అభిలషించారు. ప్రముఖ దర్శకుడు వీరభద్రం చౌదరి ముఖ్య అతిధిగా పాల్గొని… దర్శకుడిగా బాలాజీకి మంచి పేరు రావాలని కోరుకున్నారు. చిత్ర నిర్మాత బి.శ్రీనివాసరెడ్డి, దర్శకుడు కర్రి బాలాజీ, సమర్పకులు సెవెన్ హిల్స్ సతీష్ రెడ్డి, కథానాయకుడు తేజ త్రిపురాన.. తమ చిత్రం ఫస్ట్ లుక్ ఆది చేతుల మీదుగా విడుదల కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ‘ఆనంద భైరవి’ నిర్మాత తిరుపతిరెడ్డి, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్, మేనేజర్ కళ్యాణ్ సుంకర, ప్రొడక్షన్ డిజైనర్ విజయ తదితరులు పాల్గొన్నారు.
     ప్రముఖ కథానాయకి పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ వినూత్న కథా చిత్రాన్ని.. ‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్’ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ సమర్పిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
  ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల, చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, సమర్పణ: సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!