`ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అంటున్న సుధీర్ బాబు !!

`ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అంటున్న సుధీర్ బాబు !!

సుధీర్ బాబు, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి, బెంచ్‌మార్క్ స్టూడియోస్ ఫిల్మ్ టైటిల్‌.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’

‘సమ్మోహనం’, ‘వి’ తర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్లో మూడో చిత్రం రూపోందుతోంది. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద‌ర్శ‌కుడు మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డం విశేషం. ఈ చిత్రానికి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే ఆస‌క్తిక‌ర టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

త‌న సినిమాల‌కు పెట్టే టైటిల్స్ విష‌యంలో చాలా శ్ర‌ద్ధ తీసుకొని, ఆస‌క్తి రేకెత్తించే తెలుగు టైటిల్స్ పెట్టే మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మ‌రోసారి, అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించేలా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే టైటిల్ పెట్టారు.

ఒక వండ‌ర్‌ఫుల్ ల‌వ్ స్టోరీతో, రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంద‌ని టైటిల్‌ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఈ మూవీలో సుధీర్ బాబు స‌ర‌స‌న నాయిక‌గా నేటి సెన్సేష‌న‌ల్ హీరోయిన్ కృతి శెట్టి న‌టిస్తున్నారు.

త‌న సినిమాల్లో హీరోయిన్ రోల్స్‌కు చాలా ప్రాముఖ్యం ఇచ్చే, వారిని తెర‌పై బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేసే ఇంద్ర‌గంటి, ఈ సినిమాలోనూ కృతిని అంతే అందంగా ప్రెజెంట్ చేస్తున్నారు.

త‌ను ప్రేమించిన అమ్మాయిగా న‌టిస్తోన్న కృతి శెట్టి పాత్ర గురించి సుధీర్ బాబు ఏం చెప్పాల‌నుకుంటున్నార‌నేది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో నేడు ప్రారంభ‌మైంది.

బెంచ్ మార్క్ స్టూడియోస్ ప‌తాకంపై గాజుల‌ప‌ల్లి సుధీర్ బాబు స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి. మ‌హేంద్ర‌బాబు, కిర‌ణ్ బ‌ల్ల‌ప‌ల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తుండ‌గా పీజీ విందా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా సాహి సురేష్‌‌, ఎడిట‌ర్‌గా మార్తాండ్ కె. వెంక‌టేష్ వ‌ర్క్ చేస్తుండ‌గా, సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు.

అవ‌స‌రాల శ్రీ‌నివాస్, వెన్నెల కిశోర్, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, క‌ల్యాణీ న‌ట‌రాజ‌న్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

తారాగ‌ణం:
సుధీర్ బాబు, కృతి శెట్టి, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, వెన్నెల కిశోర్, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, క‌ల్యాణీ న‌ట‌రాజ‌న్.

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి
నిర్మాత‌లు: బి. మ‌హేంద్ర‌బాబు, కిర‌ణ్ బ‌ల్ల‌ప‌ల్లి
స‌మ‌ర్ప‌ణ‌: గాజుల‌ప‌ల్లి సుధీర్ బాబు
బ్యాన‌ర్‌: బెంచ్‌మార్క్ స్టూడియోస్‌
మ్యూజిక్‌: వివేక్ సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: పి.జి. విందా
ఆర్ట్‌: సాహి సురేష్‌
ఎడిటింగ్‌: మార్తాండ్ కె. వెంక‌టేష్‌
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి, కాస‌ర్ల శ్యామ్‌
కో-డైరెక్ట‌ర్‌: కోట సురేష్‌కుమార్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

 
Sudheer Babu, Mohanakrishna Indraganti, Benchmark Studios Film Titled “Aa Ammayi Gurinchi Meeku Cheppali”

Hero Sudheer Babu and director Mohanakrishna Indraganti’s third film together gets an interesting title. Aa Ammayi Gurinchi Meeku Cheppali is the title finalized for this exciting project.

Mohanakrishna Indraganti takes special care in titling his films and he likes to have chaste Telugu titles. The title Aa Ammayi Gurinchi Meeku Cheppali is an attention-grabbing one.

The title itself indicates that, this is going to be a romantic entertainer with a wonderful love story. The most happening beauty Krithi Shetty plays Sudheer Babu’s love interest in the film.

Indraganti gives a lot of importance to heroines in his films and is known for presenting them beautifully on screen

It will be interesting to know what Sudheer Babu wants to tell us about his girl played by Krithi Shetty in the film.

Regular shoot of Aa Ammayi Gurinchi Meeku Cheppali begins from today in Hyderabad.

The film is produced jointly by B Mahendra Babu and Kiran Ballapalli while Gajulapalle Sudheer Babu presents it under Benchmark Studios.

Vivek Sagar composes the music, while cinematography is handled by P G Vinda. Sahi Suresh and Marthand K Venkatesh will look after art and editing departments respectively.

Avasarala Srinivas ,Vennela Kishore ,Rahul Ramakrishna,Srikanth Iyengar and Kalyani Natarajan are the other prominent cast in the film.

Cast: Sudheer Babu, Krithi Shetty, Avasarala Srinivas, Vennela Kishore ,Rahul Ramakrishna and others.

Technical Crew
Writer, Director: Mohanakrishna Indraganti
Producers: B Mahendra Babu, Kiran Ballapalli
Presenter: Gajulapalle Sudheer Babu
Banner: Benchmark Studios
Music Director: Vivek Sagar
DOP: P G Vinda
Art Director: Sahi Suresh
Editor: Marthand K Venkatesh
Lyrics:Rama Jogayya sastry, Kasarla Shyam
Co -Director : Kota Suresh kumar
PRO: Vamsi Shekar