“A1 ఎక్స్ ప్రెస్“ ప్రీ-రిలీజ్ ఈవెంట్ !!

“A1 ఎక్స్ ప్రెస్“ ప్రీ-రిలీజ్ ఈవెంట్ !!

“A1 ఎక్స్ ప్రెస్” సందీప్ కిషన్ కి బ్లాక్ బస్టర్ అవ్వాలి- ఫ్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ !!

యూత్ హీరో సందీప్ కిషన్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లుపై డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మించిన చిత్రం “A1 ఎక్స్ ప్రెస్”. ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి హిప్ అప్ తమిల సంగీతాన్ని అందించారు.. కాగా ఈ చిత్రం ఫ్రీ- రిలీజ్ వేడుక ఫిబ్రవరి 28న హైదరాబాద్ జేఆర్సి కన్విక్షన్ సెంటర్ లో  అభిమానుల కోలాహలం మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ ముఖ్యఅతిధిగా విచ్చేయగా ప్రముఖ నిర్మాతలు జెమిని కిరణ్, అనిల్ సుంకర, యమ్ యల్ కుమార్ చౌదరి,  రచయితలు కోన వెంకట్, లక్ష్మీ భూపాల్, బెజవాడ ప్రసన్న,  ప్రముఖ కెమెరామెన్ ఛోటా కె.నాయుడు, హీరో సందీప్ కిషన్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, దర్శకుడు డెన్నిస్ జీవన్ కానుకొలను, కో-ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల, చిత్ర నిర్మాత టిజి.విశ్వప్రసాద్, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కన్వీనర్ కృతి ప్రసాద్,  స్టోరీ బ్యాంక్ హెడ్ విజయ, ప్రముఖ దర్శకులు వియన్ ఆదిత్య, జి.నాగేశ్వరరెడ్డి,  త్రినాథరావు నక్కిన తదితరులు హాజరయ్యారు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాక్డౌన్ టైములో సోషల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించింది.. ఎంతోమంది ఈ కాంటెస్ట్ లో పాల్గొనగా అందులో ముగ్గుర్ని విజేతలుగా ఎంపిక చేసి.. వారికి లక్షరూపాయల ప్రైజ్ మని అందించారు.. ఇదే వేదికపై స్టార్ జిని యాప్ లాంచ్ చేశారు. అనంతరం…

ఎనర్జిటిక్ స్టార్ రామ్ మాట్లాడుతూ… ‘ లాక్డౌన్ టైంలో ఒక దుబాయ్ ప్రొడ్యూసర్ తెలుగు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి.. మేమంతా వెయిట్ చేస్తున్నాం.. అన్నారు. అంటే మన తెలుగు సినిమాకోసం వరల్డ్ మొత్తం ఎదురుచూస్తోంది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా సందీప్ కిషన్ చెన్నైలో పరిచయం అయ్యాడు. గౌతమ్ మీనన్ దెగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి.. తర్వాత హీరో అయి, రెస్టారెంట్స్ స్టార్ట్ చేసి, ఇప్పుడు సలూన్స్ కూడా మొదలుపెట్టాడు. ఒక మనిషి ఇన్ని బిజినెస్ లలో సక్సెస్ అవడం చాలా కష్టం. సందీప్ సక్సెస్ అయ్యాడు. లావణ్య ఈస్ట్ గోదావరిలో పుట్టింది. తనకి వెటకారం చాలా ఎక్కువ. ఎప్పుడు కాల్ చేసినా నవ్విస్తుంటుంది. A1 ఎక్స్ ప్రెస్ ట్రైలర్ చూస్తుంటే పెద్ద సినిమా రేంజ్ లో కనిపిస్తుంది.  ప్రతి యాక్టర్ కి ఒక పెద్ద హిట్ సినిమా అనేది వస్తుంది.  సందీప్ కేరియర్ లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుంది. హిప్ అప్ తమిళ మ్యూజిక్ చాలా బాగుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, వివేక్ చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఎప్పుడూ క్వాలిటీ మూవీస్ నిర్మిస్తారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.. అన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. పీపుల్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ గారు ఈ సినిమా యాక్సెప్ట్ చేయడంతో నా జీవితం మారిపోయింది. ఎవరికీ అవకాశాలు రావు.. అవి మనమే సృష్టించుకోవాలి. ఆ టైంలో మనకు అండగా నిలబడ్డవారే మనకు దేవుళ్ళు.. గొప్పవాళ్ళు. ఈ చిత్రాన్ని 40 రోజుల్లో కంప్లీట్ చేశాం. అన్ని సినిమాలకి కష్టపడి చేస్తాం. ఈ సినిమాకి ఎలాంటి కష్టం లేకుండా చేశాంమంటే కారణం మా నిర్మాతల సపోర్ట్. ఈ చిత్రం ద్వారా 14 మంది టెక్కీషియన్స్ పరిచయం అవుతున్నారు.. త్వరలో వాళ్ళు టాప్ పొజిషన్స్ లో వుంటారు. డెన్ని షార్ట్ ఫిలిమ్స్ తో ఇంప్రెస్స్ చేసి బిగ్ స్పాన్ ఉన్న మూవీ చేశాడు. హిప్ అప్ తమిళ ఇచ్చిన ఐడీయాతో ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. అదిరిపోయింది.. ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది.. అన్నారు.

నిర్మాత టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ‘ సందీప్ 25వ సినిమా మా బ్యానర్ లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. రొమాంటిక్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ ఫిల్మ్.  సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది.. ఎక్స్ పెక్టేషన్స్ బాగా పెరిగాయి.. వాటికి రీచ్ అవుతుంది. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్.. అన్నారు.

అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది.. ఈ అవకాశం ఇచ్చిన విశ్వప్రసాద్, సందీప్ కి చాలా థాంక్స్.. అన్నారు.

మరో నిర్మాత దయా మాట్లాడుతూ.. ‘ నిను వీడని నీడను నేనే ఫిల్మ్ మంచి హిట్ అయింది.. దాని తరువాత మళ్ళీ సందీప్ కిషన్ తో ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమా చేశాం. తెలుగులో వస్తున్న ఫస్ట్ హాకీ బేస్డ్ ఫిల్మ్ ఇది.. పెద్ద హిట్ అవుతుంది.. అన్నారు.

చిత్ర దర్శకుడు డెన్నిస్ జీవన్ కానుకొలను మాట్లాడుతూ.. ‘ మాది వైజాగ్. షార్ట్ ఫిల్మ్ తీసిన నేను నేషనల్ అవార్డు కోసం హైదరాబాద్ వచ్చాను. ఆటైమ్ లో సందీప్ కిషన్ గారికి కథ చెప్పాను.. ఆయనకు నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీపుల్ మీడియా, అభిషేక్, దయా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి మంచి సినిమా తీయడానికి సహకరించారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ నాకు కోపరేట్ చేశారు. అన్నారు.

హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో రఫ్ గా వుండే రౌడీ లాంటి క్యారెక్టర్ చేశాను. సందీప్ వెరీ నైస్ కో యాక్టర్. టీమ్ అందరూ సపోర్ట్ చేశారు. హిప్ అప్ తమిళ సూపర్బ్ మ్యూజిక్ చేశాడు. కెమెరా కమ్రాన్ ఎక్స్ లెంట్ ఫోటోగ్రఫీ చేశాడు. జీవన్ ఫస్ట్ మూవీ అయిన బ్యూటిఫుల్ గా తెరకెక్కించాడు. మా నిర్మాతలందరికీ స్పెషల్ థాంక్స్.. అన్నారు.