ఆర్. కె. కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామానాయుడు జయంతి ఉత్సవాలు

ఆర్. కె. కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామానాయుడు జయంతి ఉత్సవాలు

ఆర్. కె. కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామానాయుడు జయంతి ఉత్సవాలు

     R k కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామానాయుడు జయంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఫిల్మ్ నగర్  ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా నిర్వహించారని సంస్థ అధినేత డాక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు

     ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారు మాట్లాడుతూ సినిమా రంగంలో ఎంతగానో కృషి చేసిన డాక్టర్ రామానాయుడు జయంతి ని ఇంత ఘనంగా  నిర్వహించిన రంజిత్ కుమార్ ని అభినందించారు ,అలాగే రామానాయుడు నాకు సన్నిహితులు, ఆయన సినిమా రంగానికి చేసిన కృషికి అనేక అవార్డ్ లు సాధించిన ఘనుడు ఆయనకి శిలా విగ్రహం ఏర్పాటు చేయటం పట్ల అభినందనలు తెలిపారు, అలాగే ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చెయ్యాలని,నాట్య ప్రదర్శన లు చేసిన పిల్లలను అభినందించి వారికి బాల నాట్య రత్న అవార్డ్ లు ప్రదానం చేశారు,

      ఆర్ కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ రంజిత్ మాట్లాడుతూ 

డాక్టర్ రామానాయుడు గారి జయంతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన సినిమా రంగానికి చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది, అలాగే ఫిల్మ్ ఛాంబర్ లో రామానాయుడు విగ్రహప్రతిష్ఠ చేసినందుకు నిర్మాతలకు పెద్దపీట వేసినట్లు అయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమంలో  గవర్నర్ రోశయ్య గారు పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు