హ్యాపీ బ‌ర్త్ డే నితిన్!!

హ్యాపీ బ‌ర్త్ డే నితిన్!!
  `జ‌యం` చిత్రంతో హీరోగా  విజ‌య వంతంగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు నితిన్.  ఆ త‌ర్వాత చేసిన `దిల్ ` తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్నాడు. ప‌వ‌న్ ఫ్యాన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన ప్ర‌తి సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాటో, మాటో వాడుతూ ప‌వ‌న్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు.  చూడ‌గానే ప‌క్కింటి అబ్బాయిలా క‌నిపించే నితిన్ త‌న‌దైన స్టైల్లో సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపుని ఏర్ప‌రుచుకున్నాడు. మ‌ధ్య‌లో త‌న‌కు మించిన స్క్రిప్ట్స్ ఎంచుకుంటూ వ‌రుస ఫెయిల్యూర్స్ తో స‌త‌మ‌త‌మ‌య్యాడు.  ఆ త‌ర్వాత స్క్రిప్ట్స్ ఎంచుకోవ‌డంతో కేర్ తీసుకున్న ఈ యంగ్ హీరోగా విక్ర‌మ్ కుమార్ కె ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌` ఇష్క్` తో కొత్త పంథాలోకి అడుగుపెట్టాడు. ఆ త‌ర్వాత చేసిన `గుండె జారి గ‌ల్లంత‌య్యిందే` సినిమాతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చాడు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `అఆ` సినిమా కూడా నితిన్ కు మంచి పేరు తెచ్చింది.  ఆ త‌ర్వాత చేసిన లై, శ్రీనివాస‌క‌ళ్యాణం సినిమాలు ఫ‌ర్వాలేద‌నిపించాయి. న‌టుడుగా నితిన్ కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇలా  ప‌డుతూ లేస్తూ నితిన్ త‌న సినీ కెరీర్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు.
లేటెస్ట్ గా `ఛ‌లో` ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌తో `భీష్మ‌` సినిమా చేస్తున్నాడు. ఈ రోజు ( మార్చి 30) న పుట్టిన రోజు సంద‌ర్భంగా `భీష్మ‌` సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు.   `సింగిల్ ఫ‌ర్ ఎవ‌ర్` అనేది దీని ఉప‌శీర్షిక‌.  మ‌హాభార‌తంలో భీష్ముడిలా ఉండాల‌నుకునే ఒక బ్ర‌హ్మ‌చారి క‌థే `భీష్మ‌`,  అమ్మాయిల‌తో తిరుగుతూ…ఎప్ప‌టికీ పెళ్లి చేసుకుండా మోడ్ర‌న్ భీష్మ క్యార‌క్ట‌ర్ అని పోస్ట‌ర్ డిజైన్  చూస్తూ  తెలుస్తోంది.  `ఛ‌లో` సూప‌ర్ హిట్ త‌ర్వాత వెంకీ కుడుముల చేస్తోన్న సినిమా కావడంతో ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.  మ‌రోవైపు నితిన్, చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు నితిన్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.  అలాగే మ‌రో వైపు ర‌మేష్ వ‌ర్మ‌తో కూడా మ‌రో సినిమా క‌మిట‌య్యాడు నితిన్.  భీష్మ‌లో నితిన్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాలతో నితిన్ మ‌ళ్లీ స‌క్సెస్ ఫుల్ జ‌ర్నీ కొన‌సాగించాల‌ని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.