సూప‌ర్‌స్టార్` కృష్ణ‌గారికి `మా` పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు

సూప‌ర్‌స్టార్` కృష్ణ‌గారికి `మా` పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు
 
సూప‌ర్‌స్టార్ కృష్ణగారి 75వ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) స‌భ్యులు నాన‌క్‌రామ్‌గూడ‌లోని ఆయ‌న స్వ‌గృహంలో క‌లిశారు. పుష్ప‌గుచ్ఛాన్నిచ్చి హీరో కృష్ణ‌గారికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల్ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ స‌భ్యులంద‌రూ కృష్ణగారి చేత కేక్ క‌ట్ చేయించారు. హీరో కృష్ణగారి జ‌న్మ‌దిన వేడుక‌ల్లో ఆయ‌న స‌తీమ‌ణి శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల‌, `మా` ప్రెసిడెంట్ న‌రేష్‌,  వైస్ ప్రెసిడెంట్ హీరో రాజ‌శేఖ‌ర్‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జీవితా రాజ‌శేఖ‌ర్ మ‌రియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ స‌భ్యులు పాల్గొన్నారు.