వ‌ర్మ‌కు షాక్టిచ్చిన కోర్టు!!

వ‌ర్మ‌కు షాక్టిచ్చిన కోర్టు!!
వ‌ర్మ‌కు షాక్టిచ్చిన కోర్టు!!
రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్‌` చిత్రానికి అడుగ‌డుగునా బ్రేకులు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు ఈ శుక్ర‌వారం  విడుద‌లవుతోంద‌నుకున్న స‌మ‌యంలో విడుద‌ల నిలిపేయాలంటూ మంగ‌ళ‌గిరి కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్ప‌టికే అన్ని థియేట‌ర్స్ హౌజ్ ఫుల్ బుకింగ్ అయ్యాయి కూడా. ఇలా బ్రేక్ ప‌డ‌టంతో ఆర్జీవీ కి షాక్ త‌గిలిన‌ట్టైంది.
యూట్యూబ్ లో కానీ, ట్విట్ట‌ర్ లో కానీ, ఇన్ స్టా లో కానీ ఎటువంటి సోష‌ల్ ఫ్లాట్ ఫామ్ ల‌లో రిలీజ్  చేయ‌కూడ‌ద‌ని కోర్టు స్ట్రాంగ్ గా చెప్ప‌డంతో వ‌ర్మ చేసేదేమీ లేకుండా పోయింది.  ఎల‌క్ష‌న్స్ అయిపోయాక ఏప్రిల్  15న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది