సింగ‌ర్ సునీత వివాహం

సింగ‌ర్ సునీత వివాహం

గ‌త కొన్ని రోజులుగా సింగ‌ర్ సునీత పెళ్లిపై రూమ‌ర్స్‌కి చెక్ ప‌డింది. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త రామ్ వీర‌పునేనితో జ‌రిగిన నిశ్చితార్థం ఫొటోను త‌న ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసింది. ఇరువురి కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ నిశ్చితార్థం ఫొటోతో పాటు ప్ర‌తి త‌ల్లిలాగే నేను నా పిల్ల‌లు స్థిర ప‌డాల‌ని కోరుకుంటాను. అలానే నేను నా జీవితంలో స్థిర‌ప‌డాల‌ని, ఆనంద‌గా జీవించాల‌ని ఆశించే త‌ల్లిదండ్రులు, పిల్ల‌లు నాకున్నందుకు ఎంత‌గానో సంతోషిస్తున్న… నా జీవితంలో అలాంటి స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ది. న‌న్ను, నా పిల్ల‌ల‌ను సంర‌క్షించే స్నేహితుడు… అత్భుత‌మైన స‌హ‌చ‌రుడు రామ్ నా జీవితంలోకి ప్ర‌వేశించాడు. త్వ‌ర‌లోనే మేమిద్ద‌రం వివాహ‌బందంలోకి అడుగుపెట్ట‌బోతున్నాం. నా వ్య‌క్తిగ‌త జీవితం గోప్యంగా ఉంచాన‌ని అర్థం చేసుకున్న వారికి కృత‌జ్ఞ‌త‌లు.. ఎప్ప‌టికీ నాకు మీ స‌పోర్ట్ అందివాల‌ని కోరుకుంటున్నాను.. అని పోస్ట్ చేశారు.