రోశయ్య ఆవిష్కరించిన పోలీస్ పటాస్ ట్రైలర్  

రోశయ్య ఆవిష్కరించిన పోలీస్ పటాస్ ట్రైలర్  
రోశయ్య ఆవిష్కరించిన పోలీస్ పటాస్ ట్రైలర్  
రోశయ్య ఆవిష్కరించిన పోలీస్ పటాస్ ట్రైలర్

ఆయేషా హబీబ్ ,రవికాలే ప్రధాన పాత్రలో శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “పోలీస్ పటాస్”. బీమవరం టాకీస్ పై  తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తొన్న 97 వ చిత్రమిది.  ఇటీవలె ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను బిజెపి ఎంపి టి.జి.వెంకటేష్ ఆవిష్కరించారు. కాగా జులై 4  రొశయ్య 87 జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మాత  రామ సత్యనారాయణ ఈ చిత్ర ట్రైలర్ ను రోశయ్య చేత ఆవిష్కరించారు. 

 ఈ సందర్బంగా రోశయ్య మాట్లాడుతూ.. రామ సత్యనారాయణ నిర్మాతగా వంద సినిమాలకు చెరువయ్యే ప్రయత్నంలో ఉన్నారు. తన బ్యానర్ నుంచి వస్తొన్న 97 చిత్రం పోలీస్ పటాస్ మంచి విజయాన్ని అందుకొవాలని ఆశిస్తున్నానన్నారు. 

రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. పెద్దలు రొశయ్య గారు మాకు గురువు. మా విజయాల వెనుక స్పూర్తి ని అందించిన వారు. ఆయన జన్మదినం అంటే మాలాంటి వారికి పర్వదినం. ఈ సందర్బంగా త్వరలొనె మా బ్యానర్ నుంచి వస్తొన్న 97 చిత్రం “పోలీస్ పటాస్”  ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. ఆయేషా నటన ఈ చిత్రానికి హైలైట్. మాస్ కు ఆకట్టుకునె అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయన్నారు.