“మరో ప్రేమకథ” కు ప్రేమతో శ్రీముఖి బైట్.!

“మరో ప్రేమకథ” కు ప్రేమతో శ్రీముఖి బైట్.!
 
శ్రావణ్ వై జి టి, షీతల్ భట్ జంటగా కె బిక్షపతి దర్శకత్వంలో  రుద్రక్రాంతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై వెంకటేశం నిర్మిస్తున్న సినిమా “మరో ప్రేమకథ” ఇదొక లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా నుండి నల్లని కాటుకా అనే వీడియో సాంగ్ విడుదల అయి, మ్యూజిక్ లవర్స్ తో పాటు మాస్ బీట్ సాంగ్ అభిమానులను అలరిస్తుంది. అయితే ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది ప్రముఖ ఢీ కొరియోగ్రాఫర్ పండు. అయితే ఈ సాంగ్  ప్రముఖ యాంకర్ మరియు నటి శ్రీముఖి మాట్లాడుతూ “మరో ప్రేమకథ అనే సినిమా నుండి తాజాగా నల్లని కాటుకా అనే వీడియో సాంగ్ రిలీజ్ అయింది, నేను  ఆ సాంగ్ చుసాను, పాట కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది, ఆ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసిన పండు నాకు బాగా తెలుసు, పండు డార్లింగ్ నువ్వు  కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, సాంగ్ లో మంచి ఎనర్జీ ఉంది, ఈ సాంగ్ లో డ్యాన్స్ పట్ల నీకున్న ఇష్టం కనపడుతుంది, నేను టీం అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ, మా పండు కి ఆల్ థ బెస్ట్ తెలుపుతున్నాను అని తెలియజేసారు శ్రీముఖి. కాగా ఈ సాంగ్ లో ఐటెం గర్ల్ గా అదిరిపోయే స్టెప్ లు వేసిన నమ్రిత మల్ల డ్యాన్స్ కు యూత్ ఫిదా అవుతున్నారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది.