ప్రేక్షకుల దగ్గరకు ‘రాజ్‌దూత్‌’ యూనిట్‌ టూర్‌

ప్రేక్షకుల దగ్గరకు ‘రాజ్‌దూత్‌’ యూనిట్‌ టూర్‌

ప్రేక్షకుల దగ్గరకు 'రాజ్‌దూత్‌' యూనిట్‌ టూర్‌

స్వర్గీయ రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజ్‌ దూత్‌’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై అర్జున్‌ -కార్తీక్‌ దర్శకత్వంలో ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ ఇటీవల రిలీజై మిలియన్‌ వ్యూస్‌ అధిగమించి యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. అటు పరిశ్రమ వర్గాలు నుంచి ఇటు సామాన్య ప్రేక్షకుడిలోనూ మంచి స్పందన వచ్చింది. రియల్‌ స్టార్‌ వారసుడిగా మేఘాంశ్‌ తండ్రి పేరు నిలబెడతారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. మరోవైపు పాటలకు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా స్టూడెంట్స్‌లో ఈ పాటలు అలరిస్తున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్‌ నేరుగా ప్రేక్షకుల్ని కలవడానికి వైజాగ్‌, గుంటూరు, విజయవాడలకు ప్రేక్షకుల కోసం యాత్రను ప్రారంభించారు. ఇందులో హీరో, హీరోయిన్లు పాల్గొనున్నారు. ఆ వివరాలను చిత్ర యూనిట్‌ ఈ విధంగా తెలియజేసింది.

ఈనెల 27 ఉదయం వైజాగ్‌కు చిత్ర యూనిట్‌ చేరుకుంటుంది. 10.30 గంటలకు చైతన్య కాలేజీ, 11.30 సమత కాలేజీ, 12.30కు రేడియో మిర్చిలో అలరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు రఘు కాలేజీ, 3.00 గంటలకు అవంతి కాలేజీ, సాయంత్రం 7.00 గంటలకు సిఎం.ఆర్‌. మాల్‌లో ప్రెస్‌మీట్‌లో పాల్గొననున్నారు. 

మరుసటి రోజు అనగా ఈనెల 28వ తేదీన గుంటూరు చేరుకుంటారు. ఉదయం 10గంటలకు వి.వి.ఐ.టి. కాలేజీ, 11.30గంటలకు ఎస్‌.ఎం.సి.ఇ. కాలేజీలో పాల్గొని మధ్యాహ్నానానికి విజయవాడ చేరుకుంటారు. విజయవాడలో 2గంటలకు రేడియో మిర్చిలోనూ పాల్గొని పిదప సిద్దార్థ ఉమెన్స్‌ కాలేజీ, వికాస్‌ కాలేజీలోనూ స్టూడెంట్‌ను కలవనున్నారు. రాత్రి 7గంటలకు పి.వి.పి. మాల్‌లో సాంగ్‌ను విడుదల చేయనున్నారు.