`పులిజూదం` చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్  – మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్  లాల్‌

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, విశాల్, హన్సిక, రాశీ ఖన్నా, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ మల్టీస్టారర్ ‘పులిజూదం’. బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో రవితేజ ‘పవర్’, ‘ఆటగదరా శివ’, తమిళంలో రజనీకాంత్ ‘లింగా’, హిందీలో సల్మాన్ ఖాన్ ‘భజరంగి భాయీజాన్’ సినిమాలు నిర్మించిన ప్రముఖ కన్నడ నిర్మాత ‘రాక్ లైన్’ వెంకటేష్ ఈ సినిమాను నిర్మించారు. తెలుగులోనూ ఆయనే విడుదల చేస్తున్నారు. ఈ నెల (మార్చి) 21న విడుద‌లైన ఈ చిత్రం కోటి రూపాయ‌లకు పైగా షేర్‌ను సాధించి స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా…
మోహ‌న్ లాల్ మాట్లాడుతూ – “వైవిధ్య‌మైన చిత్రాల‌ను ఆద‌రించ‌డంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందు ఉంటార‌ని మ‌రోసారి మా `పులిజూదం` సినిమాతో నిరూపిత‌మైంది. నేను న‌టించిన మ‌న్యంపులి సినిమా కంటే పులి జూదం సినిమా చాలా పెద్ద హిట్ సాధించింది. పులిజూదం సినిమాను ఇంత‌లా ఆద‌రిస్తున్న తెలుగు ప్రేక్ష‌కుల‌ను నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. మీ ఆద‌రాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొన‌సాగాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.