నితి‌న్ @ 30

నితి‌న్ @ 30

యువ న‌టుడు నితి‌న్ కొత్త చిత్రం షూటింగ్ ఇటీవ‌ల దుబాయ్‌లో ప్రారంభ‌మైంది. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నితిన్ కు జోడిగా న‌భా న‌టేష్ న‌టిస్తున్నారు. వీరిద్ద‌రిపై ప‌లు స‌న్నివేశాలు దుబాయ్‌లో చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం గురించి హీరో నితిన్ స్వ‌యంగా వెల్ల‌డిస్తూ… ఒక లైవ్ ఫొటోను త‌న ఇన్ స్ట్రాలో షేర్ చేశారు. నితిన్ కెరియ‌ర్‌లో త‌న 30 చిత్రం ఇది. బాలీవుడ్‌లో సూప‌ర్‌హిట్‌గా నిలిచిన అంధాదున్ చిత్రానికి రీమేక్ ఇది.