ఎస్ కోటలో శ్రీ ఆదిలక్ష్మి జ్యూయలర్స్ ప్రారంభం – సినీ నటి అనసూయ భరద్వాజ సందడి

ఎస్ కోటలో శ్రీ ఆదిలక్ష్మి జ్యూయలర్స్ ప్రారంభం – సినీ నటి అనసూయ భరద్వాజ సందడి

 

 

ఎస్ కోటలో శ్రీ ఆదిలక్ష్మి జ్యూయలర్స్ ప్రారంభం
– సినీ నటి అనసూయ భరద్వాజ సందడి

ఎస్ కోట, ఫిబ్రవరి 25, 2024: స్వర్ణాభరణాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆదిలక్ష్మి జ్యూయలర్స్ తన మొదటి బ్రాంచ్ ను ఎస్ కోటలో సీని నటి అనసూయ భరద్వాజ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఈ ఈవెంట్‌ను హనూస్ ఫిలిం ఫ్యాక్టరీ ఆర్గనైజ్ చేసింది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ స్వర్ణాభరణాల విక్రయంలో ఆదిలక్ష్మి జ్యూయలర్స్ కు దశాబ్దాల చరిత్ర ఉందన్నారు. నాణ్యతతో కూడిన ఆభరణాలు అందిస్తూ కస్టమర్ల మన్ననలు పొందిందన్నారు. ఈ బ్రాంచ్ కూడా కస్టమర్ల ఆదరాభిమానాలు చూరగొనాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాట్లాడుతూ బంగారు ఆభరణాలు అంటే మహిళలకు అమితమైన ఇష్టమన్నారు. అందుకే ఏ సందర్భం వచ్చినా బంగారు ఆభరణాలు కొంటూ ఉంటారన్నారు. అయితే, బంగారు ధరలు ఈమధ్యన భారీగా పెరిగాయన్నారు. బంగారం విలువ ఎప్పటికీ తగ్గదన్నారు. నాణ్యమైన బంగారు ఆభరణాలు కస్టమర్లకు అందించాలన్నారు.

ఈ సందర్భంగా శ్రీ ఆదిలక్ష్మి జ్యూయలర్స్ చైర్మన్ పెనగంటి అప్పలనాయుడు మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఉర్వశి జంక్షన్ లో దశాబ్దాలుగా కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. మా న్యూ బ్రాంచ్ కూడా సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై 50 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నామని చెప్పారు. వెండి పట్టీలు, వెండి వస్తువులపై తరుగు, మజూరి లేదన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా శ్రీ ఆదిలక్ష్మి జ్యూయలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ నాణ్యమైన బంగారు ఆభరణాలు అందించడంలో ఆదిలక్ష్మి జ్యూయలర్స్ పేరుగాంచిందన్నారు. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కాపాడుకుంటామని చెప్పారు. బీఐఎస్ హాల్‌మార్క్ ఆభరణాలకు ప్రసిద్ధి అన్నారు. నాణ్యతలో రాజీ పడమన్నారు. కస్టమర్ల సంతోషమే ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎస్ కోట ఎంపీపీ సంధి సోమేశ్వరరావు, జామి ఎంపీపీ గొర్లె సరయు, ఎల్ కోట ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, వేపాడ ఎంపీపీ దొగ్గ సతీష్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, రెడ్డి పైడిబాబు, పొట్నూరు వరలక్ష్మి, కొల్లి కోటేశ్వరరావు, లగుడు సత్యం నారాయణ, ఇందుకూరి అశోక్ రాజు, కాకర వెంకట సన్యాసిరాజు, నాధు వెంకన్నబాబు, మళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సందడి చేసిన అనసూయ

ఎస్ కోటలో శ్రీ ఆదిలక్ష్మి జ్యూయలరీ షోరూమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అనసూయను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఆమె వస్తుందని ముందే తెలియడంతో ఉదయం నుంచే జనం బారులు తీరారు. ఆ ప్రాంతం ఆమె అభిమానులతో కిక్కిరిసిపోయింది. షోరూమ్ ప్రారంభించిన తరువాత స్టేజ్ మీదకు వచ్చి అందరికీ అభివాదం చేశారు. హాయ్ ఎస్ కోట అంటూ హుషారెత్తించారు. అభిమానులకు సెల్ఫీలిచ్చారు.