ఈ నెల 21న “స్టూవర్టుపురం” మూవీ విడుదల

ఈ నెల 21న “స్టూవర్టుపురం” మూవీ విడుదల

ఈ నెల 21న "స్టూవర్టుపురం" మూవీ విడుదల

అర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో గూఢచారి ఫేమ్ ప్రీతి సింగ్ ప్రధానపాత్రలో సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “స్టూవర్టుపురం”. ప్రస్తుతం ఈ చిత్రం యు/ఏ సెర్టిపికెట్ తో  సెన్సార్ పూర్తి చేసుకొని  జూన్ 21 న విడుదలకు సిద్ధమౌతున్నది. ఇటీవలే ప్రముఖ దర్శకుడు సుకుమార్  సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ ని  విడుదల చేయగా మంచి హైప్ ఏర్పడింది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం గురించి  సమర్పకుడు రంజిత్ కోడిప్యాక మాట్లాడుతూ …. గతంలో మా బ్యానర్ లో నిర్మించిన నందికొండ వాగుల్లోనా, మోని చిత్రాల దర్శకుడు సత్యనారాయణ ఏకారి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మరో చిత్రమిది. కమర్షియల్ హంగులతో దర్శకుడు అద్భుతంగా తెరకేకించాడు, ఈ నెల 21 న విడుదల చేస్తున్నామన్నారు. 
దర్శకుడు సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ …  స్టూవర్ట్ పురం  ట్రైలర్ ప్రముఖ దర్శకులు సుకుమార్ గారు విడుదల చేయడం, ఈ ట్రైలర్ కు భారీ హైప్ వచ్చింది. ముఖ్యంగా యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ ని సంపాదించుకుంది. ఆ ఉత్సాహంతో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నాం.  ఇక సినిమా గురించి చెప్పాలంటే నరరూప రాక్షసులైన స్టూవర్టుపురం గ్యాంగ్, హీరోయిన్ ఇంట్లోకి చొరబడతారు, ఆ క్షణంలో హీరోయిన్ వాళ్ళను ఎలా డీల్ చేసిందన్న పాయింట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దాం, రిరికార్డింగ్ కు మంచి స్కోప్ ఉంది. దానికి తగ్గట్టే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను నవనీత్ చారి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అందించారు, తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది అన్నారు. హీరోయిన్ ప్రీతి సింగ్ మాట్లాడుతూ.. ఇందులో చాలా పవర్ ఫుల్ రోల్ పోషించాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు. 

మల్లికా,రవిరాజ్,భాను ప్రసాద్ ,హర్ష నల్లబెల్లి ,శివప్రసాద్ ,సాయిరామ్ దాసరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : వెమేష్ పెట్ల , కెమెరా , 
ఎడిట్టింగ్ : లక్కీ ఏకరీ , సంగీతం : నవనీత్ చారి , కో డైరెక్టర్ : టైగర్ రాంబాబు , సమర్పణ : రంజిత్ కోడిప్యాక ,కథ స్క్రీన్ ప్లే , నిర్మాత , దర్శకత్వం : సత్యనారాయణ ఏకారి.