ఇది చాలదన్న రామ్ చరణ్ -సాయితేజ్ 

ఇది చాలదన్న రామ్ చరణ్ -సాయితేజ్ 
 
ఇది చాలదన్న రామ్ చరణ్ -సాయితేజ్ 
 
‘ప్రతిరోజూ పండగే’లో హీరో సాయితేజ్ ఫిట్‌గా కనిపిస్తున్నాడు. సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తాడని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన స్టిల్స్‌లో సిక్స్‌ప్యాక్‌ లేదు. మజిల్ బాడీలో మస్తుగా ఉన్నాడు. ఒకవేళ మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని సిక్స్ ప్యాక్ దాచారేమో! 
 ‘చిత్రలహరి’లో పాత్ర కోసం సాయి తేజ్ బరువు పెరిగాడు. ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆయన చెవిన విమర్శలు పడ్డాయో? లేదా ఫిట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నాడో? మొత్తానికి ‘ప్రతిరోజూ పండగే’ సమయానికి ఫిట్‌గా మారాడు. అసలు, ఈ సినిమా కోసం సిక్స్‌ప్యాక్‌ చేయాలనే ఆలోచన సాయితేజ్‌దే అని దర్శకుడు మారుతి, నిర్మాత ‘బన్నీ’ వాస్ చెప్పారు. ఆలోచన అతడిదైనా? ఆచరణలో పెట్టడానికి సహాయం చేసిన వ్యక్తుల్లో రామ్ చరణ్ ఉన్నాడు. 
   
     సాయితేజ్‌ను సల్మాన్ ఖాన్ పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్ రాకేష్ ఉడైయార్ దగ్గరకు పంపించాడు రామ్ చరణ్. క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తూ… నచ్చిన వంటలు తినకుండా నోటికి తాళం వేసి మరీ సాయి తేజ్ బరువు తగ్గాడు. అందరి నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడి బాడీ చూసిన రామ్ చరణ్ మాత్రం ‘ఇది చాలదు రా… ఇంకా చేయాలి’ అని చెప్పాడట. ఎక్కువ వర్కవుట్స్ చేయాలనీ, బాడీని మరింత స్ట్రాంగ్ చేయాలనీ సూచించాడట.