`అల్లు’ జ‌యంతి కానుక‌..ప‌దెక‌రాల్లో ‘అల్లు స్టూడియోస్’ !!

`అల్లు’  జ‌యంతి కానుక‌..ప‌దెక‌రాల్లో ‘అల్లు స్టూడియోస్’ !!

`అల్లు’ జ‌యంతి కానుక‌..ప‌దెక‌రాల్లో ‘అల్లు స్టూడియోస్’ !!

అల్లు రామ‌లింగ‌య్య జ‌యంతిని పుర‌స్క‌రించుకుని అల్లు వారి కుటుంబం ప్ర‌త్యేక ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రించింది. అల్లు అర‌వింద్ అండ్ ఫ్యామిలీ అల్లు రామ‌లింగ‌య్య పేరు మీదుగా అల్లు స్టూడియోస్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

హైద‌రాబాద్ లోని గండిపేట్ ప్రాంతంలో 10 ఎక‌రాల విస్తీర్ణంలో అల్లు స్టూడియోస్ ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న‌ట్టు అల్లు అర‌వింద్ తోపాటు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ప్ర‌క‌టించారు. అత్యాధునిక సౌక‌ర్యాల‌తో ఫిల్మ్ మేకింగ్ కు అనుకూలంగా ఉండేలా ఆర్ట్ ఫిలిం స్డూడియో నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. స్డూడియో నిర్మాణ పనులు కూడా త్వ‌ర‌లోనే షురూ కానున్న‌ట్టు తెలుస్తోంది. అల్లు స్డూడియో రావ‌డం ఓ వైపు ఆయ‌న అభిమానుల‌కే కాకుండా సినీ కార్మికుల‌కు కూడా మంచి వార్త‌నే చెప్పాలి. స్టూడియోతో ప‌లువురు కార్మికులు ఉపాధి దొరుకుతుంది.