SD C/o VenuchuPally First Schedule Completed

SD C/o VenuchuPally First Schedule Completed
 
‘ఎస్‌డి కేరాఫ్‌ వెంచపల్లి’ తొలి షెడ్యూల్‌ పూర్తి!!
 
 భాను ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శ్రీసాయి అమృతల‌క్ష్మీ క్రియేషన్స్‌ సమర్పణలో గోదారి భానుచందర్‌, తిరుపతి పటేల్‌ సంయుక్తంగా పాలిక్‌ దర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘ఎస్‌డి కేరాఫ్‌ వెంచపల్లి’ . శ్రీజిత్ ల‌వన్‌, కారోణ్య కత్రిన్‌ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 30వ తేదీన మంచిర్యాల‌ పట్టణంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రారంభించుకోవడం జరిగింది. తొలి సన్నివేశానికి  శ్రీ ల‌క్ష్మీ నరసింహా చారీ క్లాప్‌ కొట్టగా  సీనియర్‌ నటు జీవా గారు కెమేరా స్విచ్‌ ఆన్‌ చేసి ఈ చిత్రాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా దర్శకుడు పాలిక్‌ మాట్లాడుతూ..‘‘ ముహూర్తం రోజే  షెడ్యూల్‌ ప్రారంభించి మంచిర్యా జిల్లా, న‌స్పూర్  మండంలోని న‌స్పూర్  కోటలో మరియు పరిసర ప్రాంతాలో మొదటి షెడ్యూల్‌ విజయవంతంగా పూర్తి చేసాం. ‘ఎస్‌డి కేరాఫ్‌ వెంచపల్లి’ అనేది పూర్తి జానపద చిత్రం. దొర‌లు, దొరసానమ్మల ప్రేమ, స్నేహంతో కూడిన కథే ఈ ఎస్‌డి చిత్రం. చాలా మంది ప్యాడింగ్‌ ఆర్టిస్టులు  మరియు కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తూ, పూర్వపు వైభవం గుర్తు చేస్తూ పల్లె అందాల‌ను తల‌పిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నాలుగు  షెడ్యూల్స్‌ లో 3 పాటల‌తో ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నాం. ఈ చిత్రంలో హీరో తల్లిదండ్రులుగా జీవా, దివ్య నటిస్తుండగా గబ్బర్‌సింగ్‌ బ్యాచ్‌ ఈ చిత్రానికి స్పెషల్‌ ఎఫెక్ట్‌గా నిల‌వనున్నారు. కొన్ని సన్నివేశాలు  ఆడియన్స్‌ను అబ్బుర పరిచేలా ఉంటాయి. ఈ చిత్రం కోసం గత 9 నెలుగా కృషి చేస్తూ ఎక్కడెక్కడి నుండో కళాకారుల‌ను సేకరించి ప్రతి ఒక కొత్త కళాకారునికి అవకాశం కల్పించాల‌నే ఆలోచనతో దర్శకుడు పాలిక్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విభిన్నమైన పాత్రలో అర్క చంద్రసిద్ధార్థ నటిస్తుండగా జగన్‌ దొర పాత్రలో ప్రణవి, వెన్నెల‌, దొర మనవరాళ్లుగా నటిస్తున్నారు. కమెడియన్స్‌గా ఆకాష్‌, వెంకటేష్‌, పాలేరు పాత్రలో మాస్టర్‌ క్కీ మంచి గుర్తింపు తీసుకురానున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీరంగం పంకజ్‌ ను విల‌న్‌గా పరిచయం చేస్తున్నాం. అలాగే రామ్‌సింగ్‌, రాజారామ్‌, రోహిత్‌, వంశీకృష్ణ తదితరులు  నటిస్తున్నారు.